శనివారం 30 మే 2020
Telangana - May 22, 2020 , 14:07:16

రైతును రాజును చెయ్యడమే సీఎం కేసీఆర్ లక్ష్యం

రైతును రాజును చెయ్యడమే సీఎం కేసీఆర్ లక్ష్యం

సూర్యాపేట : ఇకపై మూస ధోరణిలో చేస్తున్న వ్యవసాయ పద్ధతులకు స్వస్తి పలకాలని విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రైతాంగానికి రెడ్డి పిలుపునిచ్చారు. లాభదాయక పంటలపై దృష్టి సారించాలని ఆయన రైతులకు ఉద్బోధించారు. సూర్యపేట నియోజకవర్గం పరిధిలో నీ పలు గ్రామాలలో రూ. 90 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన రహదారుల నిర్మాణపు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.లక్ష్మి నాయక్ తండా,పాచ్యానాయక్ తండా, కోటపహాడ్,జి మల్కాపురం లతో పాటు కందగట్ల, దూరజ్ పల్లి, బాలెంల, ముక్కుదేవులపల్లి తదితర గ్రామాల్లో మంత్రి జగదీష్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు.

ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో జరిగిన సభల్లో మంత్రి మాట్లాడుతూ లాభదాయక పంటలపై ముఖ్యమంత్రి కేసీఆర్ నూతనంగా రూపొందించిన గైడ్ లైన్స్ ను విధిగా పాటించాలని ఆయన రైతాంగానికి విజ్ణప్తి చేశారు. ఏ ప్రాంతాల్లో ఏ పంటలు వేస్తే రైతులకు లాభదయాకమనేది ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యయనం చేశారని మంత్రి వెల్లడించారు. రైతును రాజు ను చెయ్యడమే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమన్నారు. ఆ సంకల్పబలం చేకూరే విదంగా రైతాంగం వ్యవసాయ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పులకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. 


logo