యాదాద్రి భువనగిరి : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth reddy) యాదగిరిగుట్ట( Yadagirigutta) పర్యటనలో కాంగ్రెస్ నాయకులు, పోలీసుల మధ్య వాగ్వావాదం చోటు చేసుకుంది. ఆలయ తూర్పు రాజగోపురం ముందు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆలయంలోకి ప్రవేశించేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ప్రయత్నిం చారు. గమనించిన పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, కాంగ్రెస్ నాయకుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన ఆలయంలోకి ప్రవేశించారు.
అంతకు ముందు అర్చకులు సీఎం రేవంత్ రెడ్డికి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. గుట్టపై విష్ణు పుష్కరిణి వద్ద నమస్కారం చేసుకున్నారు. నీళ్లను తలపై చల్లుకుని, అక్కడ నుంచి సంప్రదాయ దుస్తులు ధరించి ఆలయానికి చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకొని పూజలు చేశారు. అనంతరం వైటీడీఏ అధికారులతో యాదగిరిగుట్ట అభివృద్ధిపై సమీక్షించారు.