హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ యాత్రపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మండిపడ్డారు. మోకాలికి దెబ్బ తగిలితే బోడి గుండుకు కుట్లు వేసినట్టు గుంపు మేస్త్రీ పాలన తీరు ఉందని విమర్శించారు. హైదరాబాద్లో మూసీ బాధితులు ఉంటే.. నల్లగొండలో మూసీ పరివాహక ప్రాంత రైతులను కలవడంలో రేవంత్ రెడ్డి ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. కూల్చిన ఇండ్లెక్కడ, కాలిన కడుపులెక్కడ, నువ్ తిరుగుతున్న ప్రాంతం ఎక్కడ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నీ మూసీ దాహానికి అత్తాపూర్ ఆగమైందని, గోల్నాక గొల్లుమంటుందని, దిలుషుక్ నగర్ ఢీలా పడిందన్నారు. నీ కుట్రలకు అంబర్ పేట్, అత్తాపూర్ అతలాకుతలం అవుతుంటే.. నీ పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నది ఎక్కడని ప్రశ్నించారు. అయ్యా సంబరాల రాం బాబు.. నీ అన్యాయానికి ఆవేధనలు, ఆవేశాలు, ఆక్రందనలు వినిపిస్తున్నవి, కనిపిస్తున్నవి అక్కడ కాదు.. రా ఇటు వైపు రా ఇక్కడ చెయ్యి నీ పాదాల మీద యాత్ర అంటూ ఎక్స్ వేదికగా విమర్శించారు. తేలు మంత్రం రానోడు పాము కాటుకు మంత్రం ఏసినట్లు.. పాలన తెల్వని నీకు పగ్గాలు అప్పగిస్తే ప్రజల బతుకుల్ల మన్ను పోసినవ్ అంటూ మండిపడ్డారు.
‘‘మోకాలికి దెబ్బ తగిలితే బోడి గుండుకు కుట్లు వేసినట్టు ఉంది గుంపు మేస్త్రీ పాలన తీరు
హైదరాబాద్ లో మూసి బాధితులు ఉంటే-నల్గొండలో మూసి పరివాహక ప్రాంత రైతులను కలవడంలో రేవంత్ రెడ్డి ఆంతర్యం ఏమిటి?
కూల్చిన ఇండ్లెక్కడ – కాలిన కడుపులెక్కడ -నువ్ తిరుగుతున్న ప్రాంతం ఎక్కడ ?
ఆగిన గుండెలెక్కడ – రగిలిన మనసులెక్కడ .. నువ్వు చేసిన ఎర్ర రంగు మార్కింగ్ ఎక్కడ – నువ్ చేస్తున్న పాదయాత్ర ఎక్కడ ?
నీ కుట్రలకు అంబర్ పేట్ – అత్తాపూర్ అతలాకుతలం అవుతుంటే – నీ పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నది ఎక్కడ ?
నీ మూసి దాహానికి అత్తాపూర్ ఆగమైంది -గోల్నాక గొల్లుమంటుంది-దిలుషుక్ నగర్ ఢీలా పడ్డది
అయ్యా సంబరాల రాం బాబు – నీ అన్యాయానికి..అవేధనలు,ఆవేశాలు,అక్రాందనాలు వినిపిస్తున్నవి కనిపిస్తున్నవి అక్కడ కాదు రా ఇటు వైపు రా ఇక్కడ చెయ్యి నీ పాదాల మీద యాత్ర.
తేలు మంత్రం రానోడు.. పాము కాటుకు మంత్రం ఏసినట్లు.. పాలన తెల్వని నీకు పగ్గాలు అప్పగిస్తే ప్రజల బతుకుల్ల మన్ను పోసినవ్..
నాయకత్వం అంటే కూల్చడం కాదు.. నిర్మించడం
నాయకత్వం అంటే తొవ్వ తప్పడం కాదు.. తొవ్వ చూపడం’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
మోకాలికి దెబ్బ తగిలితే బోడి గుండుకు కుట్లు వేసినట్టు ఉంది గుంపు మేస్త్రీ పాలన తీరు
హైదరాబాద్ లో మూసి బాధితులు ఉంటే-నల్గొండలో మూసి పరివాహక ప్రాంత రైతులను కలవడంలో రేవంత్ రెడ్డి ఆంతర్యం ఏమిటి?
కూల్చిన ఇండ్లెక్కడ – కాలిన కడుపులెక్కడ -నువ్ తిరుగుతున్న ప్రాంతం ఎక్కడ ?
ఆగిన… pic.twitter.com/wg1tVPXuGP
— KTR (@KTRBRS) November 8, 2024