Aligarh Muslim University: అలీఘడ్ ముస్లిం యూనివర్సిటీ మైనార్టీ హోదా కేసులో సుప్రీం 4 తీర్పులు
Aligarh Muslim University: పార్లమెంట్లో చట్టం చేసినా.. మైనార్టీ విద్యా సంస్థకు చెందిన మైనార్టీ హోదాకు ఎటువంటి ప్రమాదం ఉండదని సుప్రీంకోర్టు ధర్మాసనం ఇవాళ పేర్కొన్నది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఈ కేసులో తీర్పులను వెలువరించింది.
న్యూఢిల్లీ: అలీఘడ్ ముస్లిం యూనివర్సిటీ(Aligarh Muslim University)కి మైనార్టీ హోదా కల్పించే కేసులో .. ఇవాళ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం నాలుగు రకాల తీర్పులను వెలువరించింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నాయకత్వంలోని ఏడుగురు ధర్మాసనం ఈ తీర్పుల గురించి తెలిపింది. ఏఎంయూ కేసులో నాలుగు రకాల అభిప్రాయాలు ఏర్పడ్డాయని, దీంట్లో మూడు రకాల వ్యతిరేక తీర్పులు ఉన్నట్లు సీజే చంద్రచూడ్ తెలిపారు. మెజారిటీ తీర్పు తనతో పాటు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జేబీ పర్దివాలా, మనోజ్ మిశ్రా రాసినట్లు సీజే వెల్లడించారు. జస్టిస్ సూర్యకాంత్, దీపాంకర్ దత్త, సతీశ్ చంద్ర శర్మలు సపరేట్ తీర్పులను ఇచ్చినట్లు జస్టిస్ చంద్రచూడ్ చెప్పారు.
విద్యా సంస్థ నియంత్రణ, పరిపాలన విషయంలో పార్లమెంట్లో చట్టం చేసినా.. ఆ విద్యాసంస్థకు ఉన్న మైనార్టీ హోదాను రద్దు చేయరని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. పార్లమెంట్ చట్టంతో అలీఘడ్ ముస్లిం వర్సిటీ మైనార్టీ హోదా రద్దు అయినట్లు 1968లో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టిపారేస్తున్నట్లు సీజే చంద్రచూడ్ తెలిపారు. అడ్మినిస్ట్రేషన్లో మైనార్టీ సభ్యులు లేనంత మాత్రాన.. ఆ వర్సిటీ మైనార్టీ హోదా పోదు అని సుప్రీంకోర్టు చెప్పింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Navratri Brahmotsavams | హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి దర్శనం
Supreme Court | ఇంటర్నెట్ వినియోగం పిల్లల ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు
Post-Mortem Room: పోస్టుమార్టమ్ రూమ్లో లిక్కర్ పార్టీ.. వీడియో వైరల్ కావడంతో డాక్టర్ సస్పెన్షన్
SlumDog 33 Temple Road | షూటింగ్ పూర్తి చేసుకున్న పూరి- విజయ్ సేతుపతి ‘స్లమ్డాగ్ – 33 టెంపుల్ రోడ్!
Unemployees | వేసిందే తక్కువ పోస్టులు.. టీజీపీఎస్సీ ఎదుట నిరుద్యోగుల ఆందోళన.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

