Health Tips : వెల్లుల్లి (Garlic) తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వెల్లుల్లి అమృతంతో సమానమని ఆయుర్వేదం (Ayurvedam) చెబుతోంది. కాశ్యపసంహిత వైద్యగ్రంథంలో వెల్లుల్లికి సంబంధించి ‘లశునకల్పం’ అనే అధ్యాయమే ఉన్నది. ఈ మహామూలిక గుండెజబ్బుల (Heart Isuues) కు గొప్ప ఔషధంగా పనిచేస్తుంది. కుష్ఠు సహా అన్ని రకాల చర్మవ్యాధులకు నివారకంగా చెప్పవచ్చు. పక్షవాతం మొదలుకొని నరాల వ్యాధులన్నింటి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. విరిగిన ఎముకలతో సహా సమస్త ఎముక వ్యాధులు అన్నింటిని నయం చేయడంలో తోడ్పడుతుంది. లైంగిక సమర్థతను పెంచుతుంది.
వెల్లుల్లి అనారోగ్య సమస్యలను తగ్గించి ఆయుష్షును పెంచుతుంది. ఊపిరితిత్తుల్లో పేరిన కఫాన్ని కరిగిస్తుంది. జీర్ణశక్తిని, బలాన్ని, లైంగిక శక్తిని పెంపొందిస్తుంది. ఈ కారణాలవల్లే ఆయుర్వేదం వెల్లుల్లిని అమృతంతో సమానం అన్నది. అంతేకాదు వెల్లుల్లి నోటి దుర్వాసనను తగ్గించి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. కొవ్వును నియంత్రిస్తుంది. దంతాలు, కండరాలు, గోళ్లు, వెంట్రుకలు బలపడేలా చేసి శరీర వర్ణాన్ని మెరుగుపరుస్తుంది. రక్తప్రసరణను, నాడీవ్యవస్థను ఉత్తేజితం చేస్తుంది. అలాగే స్త్రీ-పురుషులలో సంతాన వ్యవస్థను బలపరచి సంతానప్రాప్తికి సహాయ పడుతుంది.
వెల్లుల్లితో మేధస్సు పెరుగుతుంది. కంఠస్వరం మెరుగవుతుంది. పాలలో వెల్లుల్లిని ఉడికించి తాగితే ఆస్తమా తగ్గుతుంది. క్షయ, న్యుమోనియాలో కఫాన్ని కరిగించి శ్వాసను సులభం చేస్తుంది. వెల్లుల్లి రసాన్ని వేడి నీటితో తీసుకుంటే ఉబ్బసం, దగ్గు, ఆయాసం తగ్గుతాయి. అయితే వెల్లుల్లిని ఔషధంగా తీసుకున్నప్పుడే దాని ప్రయోజనాలు దక్కుతాయి. అలా కాకుండా అతిగా తీసుకుంటే అనారోగ్యం బారిన పడాల్సి వస్తుంది. రోజుకు రెండు రెబ్బల మోతాదుకు మించకుండా ఉంటేనే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మితిమీరితే ప్రయోజనానికి బదులు హాని కలుగుతుంది.
ఇక మాంసంలోని దుర్వాసనను తొలగించేందుకు కూడా వెల్లుల్లి ఉపయోగపడుతుంది. కూరగాయలకు అలాంటి వాసనలేవీ ఉండవు కాబట్టి శాకాహారంలో దీనికి అంత అవసరం లేదని భావించి శ్రోత్రియులు, శుద్ధ శాకాహారులు సాధారణంగా వెల్లుల్లి వాడరు. వెల్లుల్లి అతిగా తిన్న వ్యక్తుల శరీరం నుంచి వెలువడే గవులుకంపు ఇతరులకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది. పౌర సంబంధమైన వృత్తుల్లో ఉన్నవారి కెరీర్ని కూడా దెబ్బతీస్తుంది.