Unstoppable S4 episode 3 | టాలీవుడ్ హీరో బాలకృష్ణ (Balakrishna) హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాక్ షో అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే (Unstoppable With NBK) ఎంత పాపులరో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ సీజన్లతో ఎంటర్టైన్ చేసిన బాలకృష్ణ తాజాగా సీజన్ 4 చేస్తున్నాడు. ఇప్పటికే ఏపీ సీఎం నారాచంద్రబాబునాయుడుతో చేసిన ఫస్ట్ ఎపిసోడ్ సక్సెస్ఫుల్ టాక్ తెచ్చుకుంది.
మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఎపిసోడ్‌కు మంచి స్పందన వస్తోంది. ఇక రీసెంట్గా మూడో ఎపిసోడ్లో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సందడి చేశాడని తెలిసిందే. ఈ ప్రోమో కూడా నెట్టింట వైరల్ అవుతుంది. తాజాగా ఫుల్ ఎపిసోడ్ వీడియో (Unstoppable S4 episode 3)ను షేర్ చేశారు.
అన్నదమ్ముల అనుబంధం, జ్యోతిక-సూర్య బాండింగ్, సామాజిక సేవ, సినిమాలు తదితర అంశాల నేపథ్యంలో ఎపిసోడ్ ఆద్యంతం ఫన్ అండ్ సీరియస్‌గా సాగుతూ అభిమానులను ఖుషీ చేస్తోంది. ఇంతకీ తన ఫస్ట్ క్రష్ ఎవరు..? సూర్యకు ఇష్టమైన నటి ఒకరున్నారు.. అని ఫోన్లైన్లో కార్తీ అంటుంటూ.. అరే నువ్వు కత్తిరా.. కార్తీ కాదు అంటున్నాడు సూర్య.
రెండు సింహాలు కలిశారు.. వేటాడటానికి కాదు.. వంద రెట్ల వినోదాన్ని ఇవ్వడానికి అంటూ విడుదల చేసిన వీడియోపై మీరూ లుక్కేయండి మరి.
Rendu simhalu kalisaru , vetadaniki kadhu Vandha retla entertainment ivvadani 🦁🎞️🦁
Watch #UnstoppableS4 episode 3 now on #aha▶️https://t.co/YyQTxf82OK@ahavideoIN #UnstoppableS4 #NandamuriBalakrishna @Suriya_offl @thedeol #AhaVideoIN #AhaOriginalSeries #NBK #kanguva pic.twitter.com/sDE67gtqqt
— BA Raju’s Team (@baraju_SuperHit) November 8, 2024
Akira Nandan | ప్రిపరేషన్ షురూ.. గ్రాండ్ ఎంట్రీ కోసం అకీరానందన్ ట్రైనింగ్.. !
krish jagarlamudi | డైరెక్టర్ క్రిష్ ఇంట వెడ్డింగ్ బెల్స్.. ఇంతకీ అమ్మాయి ఎవరో తెలుసా..?
Devara | ఓటీటీలో దేవర సందడి.. ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే.. ?