శనివారం 30 మే 2020
Telangana - May 11, 2020 , 10:51:37

కరోనా కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు బాగుంది : గవర్నర్‌ తమిళిసై

కరోనా కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు బాగుంది : గవర్నర్‌ తమిళిసై

హైదరాబాద్‌: కరోనా మహమ్మారిని కట్డడి చేయడంలో  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు బాగుంటున్నాయని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. సనత్‌నగర్‌ ఈఎస్‌ఐని సందర్శించిన గవర్నర్‌ అక్కడ అందిస్తున్న వైద్య సేవలను కొనియాడారు. కరోనాను భారత్ సమర్ధవంతంగా ఎదుర్కొంటుందన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వైద్యులు విధులు నిర్వహించడం గర్వకారణమని, అందరి నుంచి వందనం అందుకునే జవాన్లు కూడా వైద్యులకు సెల్యూట్‌ చేస్తున్నారన్నారు. రోగుల ప్రాణాలు కాపాడడమే వైద్యుల ప్రధాన ఆశయమని పేర్కొన్నారు. సాధారణ రోగులకు ఇబ్బందులు కలుగుకుండా వైద్య సేవలు అందించాలని సూచించారు. అలాగే మొబైల్‌ వైరాలజీ ల్యాబ్ ను ఏర్పాటు చేసిన బృందానికి ఆమె అభినందనలు తెలిపారు. logo