హైదరాబాద్ : సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌ను(Padma Rao Goud ) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరామర్శించారు. టకారబస్తీలోని ఆయన నివాసంలో పద్మారావు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కాగా, సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ గుండెపోటుకు గురయ్యారు. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ పర్యటనలో ఉన్న పద్మారావుకు మంగళవారం మధ్యాహ్నం గుండెపోటు వచ్చింది.
దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు, సిబ్బంది.. ఆయనను హుటాహుటిన చికిత్స నిమిత్తం హాస్పిట ల్కు తరలించారు. తక్షణమే స్పందించిన వైద్యులు.. పద్మారావు గౌడ్‌కు స్టంట్ వేశారు. ప్రాణాపాయం లేదని వైద్యులు స్పష్టం చేశారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, పువ్వాడ అజయ్ కుమార్ తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..