హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన గ్రామ సభలు(Grama sabhalu), వార్డు సభలు రసాభాసాగా మారుతున్నాయి. ప్రజలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రజలు తరమి తరిమి కొడుతున్నారు. అనర్హుల ఎంపిక, అధికారుల నిర్లక్ష్య, కాంగ్రెస్ నాయకుల దాడులతో గ్రామ సభలు కాస్తా యుద్ధక్షేత్రాలను తలపిస్తున్నాయి. ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న గ్రామ సభలు, వార్డు సభలు రెండో రోజు కూడా గందరగోళం మధ్య కొనసాగుతున్నాయి. ప్రభుత్వ హామీలపై ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు.
జనగామ జిల్లా వడ్లకొండలోని గ్రామ సభలో ఇల్లు రాలేదని అడిగినందుకు కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జగిత్యాల జిల్లా..కొడిమ్యాలలో నిర్వహించిన గ్రామ సభలో 6 గ్యారంటీలు(Six guarantees) అమలు కాలేదని ప్రజలు అధికారులను నిలదీశారు. భువనగిరి జిల్లా నారాయణపురం మండలంలోని గుడిమల్కాపురం గ్రామ సభలో అనర్హులకు రేషన్ కార్డులు(Ration cards), ఇందిరమ్మ ఇల్లు కేటాయించారని అధికారులతో వాగ్వాదానికి దిగడంతో పోలీసులు జోక్యం చేసుకొని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా అనంతరం గ్రామంలో ప్రజా పాలన గ్రామసభకు వచ్చిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిని బీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు అడ్డగించడంతో వెనుతిరిగి వెళ్లి పోయారు. సంగారెడ్డి జిల్లా కంది మండలం కౌలంపేట ప్రజలు గ్రామసభలో ఆందోళన చేపట్టారు. కాగా, ఈ నెల24 వరకు గ్రామ సభలు కొనసాగనున్నాయి.
రేవంత్ రెడ్డి రాజ్యాంగంలో ఇల్లు రాలేదని అడిగితే కొడుతున్నారు
జనగామ నియోజకవర్గం వడ్లకొండలో గ్రామ సభలో ఇల్లు రాలేదని అడిగినందుకు దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు
గ్రామ సభలో అధికారులను నిలదీస్తున్న ప్రజలు – 42 https://t.co/mtIo0UUisT pic.twitter.com/eE39mzUQGI
— Telugu Scribe (@TeluguScribe) January 22, 2025
ఆదిలాబాద్ జిల్లాలో..
నల్లగొండ జిల్లాలో..
నిర్మల్ జిల్లాలో..
పెద్దపల్లి జిల్లాలో..
మహబూబాబాద్ జిల్లాలో..
యాదాద్రి భువనగిరి జిల్లాలో..
సంగారెడ్డి జిల్లాలో..