Amaran | గతేడాది దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి హిట్స్‌గా నిలిచాయి అమరన్, క. టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) తొలి పాన్ ఇండియా ప్రాజెక్ట్ క (KA). 1970స్ ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణగిరి గ్రామం నేపథ్యంలో సాగే పీరియాడిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, తమిళంతోపాటు పాన్ ఇండియా స్థాయిలో అక్టోబర్ 31న గ్రాండ్‌గా విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది.
మేజర్ ముకుంద్ జీవితంలోని పలు కోణాలను ఆవిష్కరిస్తూ కోలీవుడ్ స్టార్ యాక్టర్ శివకార్తికేయన్ (Sivakarthikeyan) లీడ్ రోల్లో నటించిన చిత్రం అమరన్ (Amaran). అక్టోబర్ 31న తెలుగు, తమిళంతోపాటు వివిధ భాషల్లో గ్రాండ్‌గా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది.
ఈ రెండు సినిమాలు రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న (ఆదివారం) ప్రీమియర్ కానున్నాయి. అమరన్ తెలుగు వెర్షన్ స్టార్ మా ఛానెల్లో సాయంత్రం 5:30 గంటల నుంచి ప్రీమియర్ కానుండగా.. క సినిమా సాయంత్రం 6 గంటల నుంచి ఈటీవీలో ప్రీమియర్ కానుంది. బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమాలు మరి టీవీలో ఎలాంటి టీఆర్పీ రేటింగ్ నమోదు చేస్తాయనేది ఆసక్తికరంగా మారింది.
సుజిత్-సందీప్ డైరెక్ట్ చేసిన క చిత్రంలో 2018 ఫేం తాన్వి రామ్, గం గం గణేశా ఫేం నయన్ సారిక ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషించారు. వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కించిన ఈ మూవీకి శ్యా్మ్ సీఎస్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించాడు.
SK21గా తెరకెక్కిన ఈ మూవీకి రాజ్‌కుమార్ పెరియసామి (Rajkumar Periasamy) దర్శకత్వం వహించాడు. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. విశ్వరూపం ఫేం రాహుల్ బోస్ (RahulBose) విలన్‌గా నటించాడు.
అమరన్ – Republic Day Special Movie 🪖🎖️🇮🇳#Amaran | WTP (TELUGU) | JAN 26 – 5.30PM #KingSK #AmaranEpicBlockBuster pic.twitter.com/6z2rmXdnPs
— All India SKFC (@AllIndiaSKFC) January 20, 2025
Recent Blockbuster Thriller#KA Sunday 06:00PM on #EtvTelugu #KAonEtv#KiranAbbavaram #NayanSarika #KaMovie pic.twitter.com/iJCIU12o5b
— Television & Tollywood Updates (@TTUpdates360) January 19, 2025
Sukumar | పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ దాడులు
Jailer Villain | మద్యం మత్తులో జైలర్ విలన్ వినాయకన్ వీరంగం.. ఇంతకీ ఏం చేశాడంటే..?