six planets | ఆకాశంలో ఓ అద్భుతమైన ఖగోల దృశ్యం ఆవిష్కృతమైంది (Amazing astronomical event). సౌర వ్యవస్థలోని ఆరు గ్రహాలు (six planets) అంగారక, బృహస్పతి, యూరేనస్, నెప్ట్యూన్, శుక్రుడు, శని గ్రహాలు ఒకే సరళరేఖపైకి వచ్చాయి. ఇది ఓ అందమైన ప్లానెట్ పరేడ్గా కన్పించింది. ఈ ప్లానెట్ పరేడ్లో ఒకే వరుసలోకి వచ్చిన శని, బృహస్పతి, అంగారక, శుక్రుడు గ్రహాలు ఎలాంటి ప్రత్యేక పరికరాలను ఉపయోగించకుండానే మన కళ్లతో స్పష్టంగా కనిపించాయి. అయితే నెప్ట్యూన్, యురేనస్ గ్రహాలను చూసేందుకు మాత్రం టెలిస్కోప్ ద్వారానే సాధ్యమైంది. ఇది జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే జరిగే అద్భుతం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనిని ‘పరేడ్ ఆఫ్ ప్లానెట్స్’, ‘గ్రహాల కవాతు’గా పిలుస్తున్నారు.
ఈ ఖగోళ దృశ్యం మంగళవారం రాత్రి ఆవిష్కృతమైంది. సూర్యాస్తమయం అయిన 45 నిమిషాల తర్వాత ఈ అద్భుతం కనిపించింది. ఈ కలయిక దాదాపు మూడు గంటల పాటు కొనసాగింది. కొన్ని వారాల పాటు ఈ అరుదైన గ్రహాల అమరిక కనిపించనుంది. రోజూ చీకటి పడిన తర్వాత నైరుతి దిక్కున శుక్రుడు, శని గ్రహాలను రెండు గంటల పాటు చూడొచ్చని, బృహస్పతి ప్రకాశవంతంగా ప్రకాశిస్తుంది, తూర్పున అంగారక గ్రహం కనిపిస్తుందని నాసా తెలిపింది. భారత్లో ప్రతి నగరం నుంచి ఈ గ్రహాల కవాతును చూసే అవకాశం ఉంటుంది. ఇలాంటి దృశ్యం ఫిబ్రవరి 28వ తేదీన మరోసారి సాక్షాత్కారం కానుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఆకాశంలో ఆరు నుంచి ఏడు గ్రహాలు ఒకే వరుసలో రావడం చాలా అరుదుగా జరిగే సంఘటన.
Also Read..
Rashmika Mandanna | వీల్ఛైర్పై రష్మిక.. త్వరగా కోలుకోవాలంటూ అభిమానుల కామెంట్స్.. VIDEO
Illegal Migrants | ట్రంప్ నిర్ణయంతో అప్రమత్తమైన భారత్.. వారిని వెనక్కి రప్పించే యోచనలో కేంద్రం..!
Shah Rukh Khan | చిరుత దాడి నుంచి తృటిలో తప్పించుకున్న షారుక్ ఖాన్..!