Rashmika Mandanna | నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna)కి ఇటీవలే ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. రెండు వారాల క్రితం జిమ్‌లో ఎక్సర్సైజ్ చేస్తుండగా.. కాలికి గాయం (leg injury) అయింది. అప్పటి నుంచి రష్మిక ఇంట్లోనే ఉంటూ రెస్ట్ తీసుకుంటున్నారు. తాజాగా రష్మిక వీల్‌ఛైర్ (wheelchair)పై దర్శనమిచ్చారు. కాలికి కట్టుతో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ (airport)కు వచ్చిన రష్మిక.. కారు దిగగానే వీల్‌ఛైర్‌లో కూర్చుని వెళ్లారు. ఆ సమయంలో ముఖం కనిపించకుండా మాస్క్ పెట్టుకుని, తలకు క్యాప్‌తో దర్శనమిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు రష్మిక త్వరగా కోలుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.
GET WELL SOON mam 🧑🏻🦽🛐🙏🏻 #RashmikaMandanna @iamRashmika pic.twitter.com/p22ZFjKPmi
— David Bhai 🌼 ❌ 🔥 (@davidbhai003) January 22, 2025
కాగా, కాలి గాయంకి సంబంధించి ఫొటోలను ఈ కన్నడ సోయగం ఇటీవలే సోషల్ మీడియా వేదికగా పంచుకున్న విషయం తెలిసిందే. ‘సరే… నాకు నేను నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాను. నేను జిమ్‌లో గాయపడ్డాను. ప్రస్తుతం నేను హోప్ మోడ్‌లో ఉన్నాను. కోలుకోవడానికి కొన్ని వారాలు లేదా నెలలు పడుతుందో చెప్పలేను. అది ఆ దేవుడికే తెలియాలి. నేను తామా, సికిందర్, కుబేర సెట్స్‌కి తిరిగి వెళ్లాలని అనుకుంటున్నాను. నేను ఆలస్యం చేస్తున్నందుకు నా దర్శకులకు సారీ. నేను త్వరగా తిరిగి వచ్చి యాక్షన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ లోపు నేను మీకు అవసరమైతే ఒక మూలాన కూర్చొని బన్నీ హాప్ వ్యాయామం చేయడానికి ప్రయత్నిస్తాను’ అంటూ సోషల్ మీడియాలో పేర్కొంది.
ఇటీవలే పుష్ప 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ భామ బ్లాక్ బస్టర్ హిట్‌ని అందుకుంది. మరోవైపు ఈ ఏడాది రష్మిక నటిస్తున్న చిత్రాలలో చావా(Chaava) సినిమా ఒకటి. మరాఠీ చారిత్రక యోధుడు ఛత్రపతి శంభా జీ వీరోచిత పోరాటగాథను ఆవిష్కరిస్తూ పీరియాడిక్ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శంభాజీ పాత్రలో విక్కీ కౌశల్ నటించగా, ఆయన భార్య మహారాణి యేసుబాయి పాత్రలో రష్మిక మందన్న కనిపించనుంది. ఇక ఈ చిత్రం నుంచి రష్మిక ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం మంగళవారం విడుదల చేసింది. ఈ పోస్టర్లో సంప్రదాయ మరాఠీ వస్త్రధారణలో బంగారు ఆభరణాలు ధరించి రాజసం ఉట్టిపడుతూ కనిపిస్తున్నది రష్మిక. ఈ మూవీని ఫిబ్రవరి 14న విడుదల చేయబోతున్నారు. ఇదే కాకుండా సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా వస్తున్న సికిందర్ చిత్రంలో కూడా కీలక పాత్రలో నటిస్తోంది రష్మిక.
Also Read..
Dil Raju | విజయ్ వారిసు కలెక్షన్లు రూ.120 కోట్లే.. ఐటీ అధికారులతో దిల్ రాజు.. ?
Saif Ali khan | సైఫ్ అలీఖాన్ భద్రతకు పాపులర్ బాలీవుడ్ యాక్టర్ సెక్యూరిటీ ఏజెన్సీ.. వివరాలివే