Saif Ali khan | బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్‌పై ఈనెల 16న దాడి జరిగిన విషయం తెలిసిందే. నిందితుడు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ (Mohammad Shariful Islam Shahzad) సైఫ్ అలీఖాన్ ఇంటికి చోరీకి వెళ్లి అతడిపై ఆరుసార్లు కత్తితో పొడిచాడు. కుటుంబసభ్యులు సైఫ్‌ను ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేర్పించగా.. ఆరు రోజుల చికిత్స అనంతరం మంగళవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. వారం పాటు పూర్తి బెడ్ రెస్ట్ తీసుకోవాలని సైఫ్‌కు డాక్టర్లు సూచించారు.
ఈ నేపథ్యంలో సైఫ్ అలీఖాన్ ఇంటి వద్ద సెక్యూరిటీ కట్టుదిట్టం చేశారు. తాజా కథనాల ప్రకారం సైఫ్ అలీఖాన్ ఫ్యామిలీ భద్రత కోసం పాపులర్ బాలీవుడ్ యాక్టర్ రోనిత్ రాయ్ సెక్యూరిటీ ఏజెన్సీ AceSqad Security LLPని నియమించుకుంది. రోనిత్ రాయ్ సైఫ్ అలీఖాన్ అపార్ట్మెంట్ వద్దకు చేరుకుని పర్సనల్‌గా భద్రతా చర్యలను పర్యవేక్షిస్తున్నట్టు బీటౌన్ సర్కిల్ టాక్. రోనిత్ రాయ్ ఏజెన్సీ ఇప్పటికే బాలీవుడ్ స్టార్ యాక్టర్లు అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, అమీర్‌ఖాన్ భద్రతను చూసుకుంటుంది.
ఉద్యోగాన్ని వెతుక్కుంటూ ముంబైకి..
ఈ కేసులో ప్రధాన నిందితుడైన మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ (Mohammad Shariful Islam Shahzad)ను శనివారం అర్థరాత్రి 2.50గంటలకు థానేలోని హిరానంది ప్రాంతంలో అరెస్టు చేసి విచారిస్తున్న విషయం తెలిసిందే. విచారణలో భాగంగా క్రైమ్‌సీన్ రీక్రియేషన్ కోసం నిందితుడిని సైఫ్ ఇంటి వద్దకు తీసుకెళ్లారు. నిందితుడి వేలిముద్రలను కూడా తీసుకున్నారు.
కాగా నిందితుడు ఏడు నెలల క్రితమే మేఘాలయాలోని డౌకీనదిగుండా భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించాడని ఓ పోలీస్ అధికారి. ఆ తర్వాత విజయ్ దాస్‌గా పేరు మార్చుకున్న నిందితుడు పశ్చిమ బెంగాల్లో వారం పాటు ఉన్నాడు. ఉద్యోగాన్ని వెతుక్కుంటూ ముంబైకి వచ్చాడు. అయితే ముంబైకి వచ్చే కొన్ని వారాల ముందు ఓ స్థానిక వ్యక్తి ఆధార్ కార్డు మీద సిమ్ తీసుకున్నాడు. ఈ సిమ్ కార్డు పశ్చిమబెంగాల్‌కు చెందిన వ్యక్తి పేరుమీద రిజిస్టర్ అయి ఉంది. నిందితుడు కూడా భారత్‌లో ఉంటున్నట్టు ఆధార్ తీసుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడని విచారణకు సంబంధించిన కీలక విషయాలను ఓ పోలీస్ అధికారి వెల్లడించారు.
Jailer Villain | మద్యం మత్తులో జైలర్ విలన్ వినాయకన్ వీరంగం.. ఇంతకీ ఏం చేశాడంటే..?
Jaat Movie | సన్నీడియోల్-గోపీచంద్ మూవీ కోసం ఏకంగా నలుగురు యాక్షన్ డైరెక్టర్లు.. !
Sankranthiki Vasthunam | ఓవర్సీస్లోనూ తగ్గేదేలే.. వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాం అరుదైన ఫీట్