వీర వనిత యేసుబాయి
‘పుష్ప’ సిరీస్ చిత్రాలతో ఉత్తరాది ప్రేక్షకుల్లో తిరుగులేని ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది రష్మిక మందన్న. ఆమె నటించిన తాజా హిందీ చిత్రం ‘ఛావా’ ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకురానుంది.
‘పుష్ప’ సిరీస్ చిత్రాలతో ఉత్తరాది ప్రేక్షకుల్లో తిరుగులేని ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది రష్మిక మందన్న. ఆమె నటించిన తాజా హిందీ చిత్రం ‘ఛావా’ ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకురానుంది. మరాఠీ చా రిత్రక యోధుడు ఛత్రపతి శంభా జీ వీరోచిత పోరాటగాథను ఆవిష్కరిస్తూ పీరియాడిక్ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శంభాజీ పాత్రలో విక్కీ కౌశల్ నటించగా, ఆయన భార్య మహారాణి యేసుబాయి పాత్రలో రష్మిక మందన్న కనిపించనుంది.
మంగళవా రం రష్మిక మందన్న ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో సంప్రదాయ మరాఠీ వస్త్రధారణలో బంగారు ఆభరణాలు ధరించి రాజ సం ఉట్టిపడుతూ కనిపిస్తున్నది రష్మిక. ‘గొప్ప రాజులందరీ విజయాల వెనక శక్తివంతులైన మహారాణుల పాత్ర ఉంటుంది. మహారాణి యేసుబాయి…ది ప్రైడ్ ఆఫ్ స్వరాజ్య’ అంటూ ఈ స్టిల్కు క్యాప్షన్‌ను జత చేశారు. లక్ష్మణ్ ఊటేకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్నందించారు. రష్మిక మందన్న ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో ఆరు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

