Shah Rukh Khan | అడవుల్లో ఉండాల్సిన క్రూరమృగాలు జనావాసాల్లోకి ప్రవేశించి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. రాత్రి వేళల్లో రోడ్లపై సంచరిస్తూ, సమీప గ్రామాల్లోకి ప్రవేశిస్తున్నాయి. వాటి దాడి నుంచి కొందరు ప్రాణాలలో బయటపడుతుండగా.. మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా షారుక్ ఖాన్ (Shah Rukh Khan) చిరుత (Leopard) దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఈ ఘటన మహారాష్ట్రలోని వసాయి (Vasai) ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.
అయితే, ఇక్కడ షారుక్ ఖాన్ అంటే బాలీవుడ్ సెలబ్రిటీ కాదండోయ్.. ఆ పేరుగల ఓ సామాన్య వ్యక్తి. అతడు మంగళవారం అర్ధరాత్రి పని ముగించుకుని బైక్పై వెళ్తున్నాడు. వసాయి తూర్పులోని భోయిదాపాడ ప్రాంతంలో రహదారిపై చిరుత ప్రత్యక్షమైంది. దాన్ని చూసిన అతడు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యాడు. చిరుత దాడి నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. అనంతరం ఈ ఘటనపై వాలివ్ పోలీసు స్టేషన్ (Valiv police station)లో ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అటవీ శాఖ అధికారులు చిరుత కోసం గాలింపు చేపడుతున్నారు. అదేవిధంగా ఆ మార్గంలో ప్రయాణికులను అప్రమత్తం చేశారు.
Also Read..
Road Accident | కర్ణాటకలో ఘోర ప్రమాదం.. ట్రక్ బోల్తాపడి పది మంది దుర్మరణం..
Supreme Court | బెంగాల్ ట్రైనీ డాక్టర్ కేసును విచారించనున్న సుప్రీంకోర్టు