Road Accident | కర్ణాటకలో ఘోర ప్రమాదం.. ట్రక్ బోల్తాపడి పది మంది దుర్మరణం..
Road Accident | కర్ణాటకలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. యల్లాపుర సమీపంలో ట్రక్కు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో పది మంది దుర్మరణం పాలయ్యారు. మరో 15 మంది గాయపడ్డారు.
Road Accident | కర్ణాటకలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. యల్లాపుర సమీపంలో ట్రక్కు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో పది మంది దుర్మరణం పాలయ్యారు. మరో 15 మంది గాయపడ్డారు. మృతులు, క్షతగాత్రులు సావనూర్ నుంచి యల్లాపుర సంతకు పండ్లను విక్రయించేందుకు వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఉత్తర కన్నడ జిల్లాలోని సావనూర్ – హుబ్బళి రహదారిపై అటవీ ప్రాంతం మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదం జరిగిందని ఎస్పీ తెలిపారు. ఉదయం 5.30 గంటల ప్రాంతంలో ట్రక్కు డ్రైవర్ మరొక వాహనానికి దారి ఇచ్చే ప్రయత్నంలో వాహనం అదుపు తప్పి లోయలోకి దూసుకువెళ్లిందని తెలిపారు. ప్రమాదంలో 10 మంది అక్కడికక్కడే మరణించగా.. మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రులను హుబ్బలిలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
#WATCH | Karnataka | 10 died and 15 injured after a truck carrying them met with an accident early morning today. All of them were travelling to Kumta market from Savanur to sell vegetables: SP Narayana M, Karwar, Uttara Kannada
(Visuals from the spot) https://t.co/hJQ84aljHw pic.twitter.com/dVtNEKQna7
— ANI (@ANI) January 22, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

