Donald Trump : ఇజ్రాయేల్‌తో కలిసి ఇరాన్(Iran)పై యుద్ధం మొదలెట్టినఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)కు మద్ధతు కరువవుతోంది. ప్రపంచ దేశాలు వారిస్తున్న మొండిగా ముందుకెళ్లాలనుకుంటున్న ట్రంప్‌నకు సాయం చేసేందుకు నాటో(NATO) దేశాలు తిరస్కరించాయి. అంతేకాదుఅమెరికా సైన్యం ఇరాన్‌పై చేస్తున్న యుద్ధంలో తాము పాల్గొనబోమని స్పష్టం చేశాయి. దాంతో, చిర్రెత్తుకొచ్చిన ట్రంప్ మాకు ఎవరి సాయం అక్కర్లేదు అని నాటోదేశాలకు తేల్చి చెప్పారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇరాన్‌పై యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న పలు దేశాలు హర్మూజ్ జలసంధి (Hormuz Strait) వద్దకు ప్రపంచ దేశాలు యుద్ధ నౌకలను పంపడానికి నిరాకరించాయి. ట్రంప్ అభ్యర్థనను నాటో దేశాలు సున్నితంగా తోసిపుచ్చాయి. అమెరికా సైన్యాలతో కలిసి ఇరాన్‌పై యుద్ధం చేయబోమని వాషింగ్టన్ సిటీకి నాటో కూటమిలోని దేశాలు చెప్పేశాయి. దాంతో.. ఇదివరకు ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండడాన్ని వ్యతిరేకించిన నాటో దేశాలు ఇప్పుడు తనకు సహకరించకపోవడాన్ని ట్రంప్ జీర్ణించుకోలేకపోతున్నారు.
BREAKING : Donald Trump has totally lost it
At 1:00 PM — “Everyone should help us in opening Strait of Hormuz”
At 5:00 PM — “We don’t need anyone, we are the strongest country. I just ask for help to check their responses” 😭
Unreal hypoc…. See more pic.twitter.com/oGBZ4l157x
— Vladimir Putin Commentary (@VladimmirPutin) March 17, 2026
మంగళవారం ఈ కూటమి దేశాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్.. నాటోను ‘ఒకే వైపున్నవీధి’గా విమర్శించారు. ‘నాటోలోని కొన్ని దేశాల రక్షణ కోసం అమెరికా ఏటా కొన్ని వందల కొద్ది బిలియన్ డాలర్లను ఖర్చు చేస్తోంది. కానీ, బదులుగా అమెరికాకు ఈ దేశాలు ఏమీ చేయడం లేదు. ఇరాన్ సైన్యాన్ని అమెరికా నాశనం చేసింది. ఆ దేశ నావికా దళం, వాయుసేన, నాయకత్వాన్ని దెబ్బతీశాం.
Donald Trump asked the world to join a multinational naval coalition to keep the Strait of Hormuz open.
🇮🇹 Italy: Rejected
🇪🇸 Spain: Rejected
🇯🇵 Japan: Rejected
🇫🇷 France: Hesitant
🇨🇦 Canada: Rejected
🇦🇺 Australia: Rejected
🇨🇳 China: No response
🇰🇵 North kore: ….see more— The Trading Wolf (@TheTradingwolf0) March 16, 2026
ఇప్పటివరకూ ప్రపంచంలోనే అమెరికా శక్తివంతమైన దేశం. మాతో కలిసి వచ్చేందుకు నిరాకరిస్తున్న నాటో దేశాలు చాలా తెలివితక్కువ పొరపాటు చేస్తున్నాయి. ఒకవేళ ఈ దేశాలు అంగీకరించినా ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేసుకునేందుకు, కీలకమైన జల రవాణాను ఏర్పరచుకునేందుకు మేము అనుమతించే వాళ్లం కాదు’ అని ట్రంప్ వెల్లడించారు. ఇప్పటికే ఇరాన్‌పై దాడుల్లో అమెరికా సైన్యం విజయవంతమైందని, తమకు నాటో దేశాల సాయం అవసరం లేదని ట్రంప్ తేల్చి చెప్పారు. అంతేకాదు తమకు జపాన్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా సైతం సాయం చేయనక్కర్లేదని ఆయన పేర్కొన్నారు.