KTR | హైదరాబాద్ : ఈ రాష్ట్రానికి కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అయితేనే.. దేశంలో తెలంగాణ అవ్వల్ దర్జాగా నిలుస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఏనాటికైనా ఎట్టి పనికైనా, మట్టిపనికైనా మనోడే ఉండాలి. తెలంగాణ మీద కేసీఆర్కున్న ప్రేమలో ఒక్క శాతం కూడా కాంగ్రెస్, బిజెపి నాయకులకు ఉండదు. ఎన్నటికైనా ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర ప్రయోజనాలకు శ్రీరామరక్ష కచ్చితంగా కేసీఆర్ నాయకత్వం తప్ప కాంగ్రెస్, బీజేపోతోని ఎన్నటికీ కాదు. మీరు ఇది యాది పెట్టుకోవాలి. 8 మంది కాంగ్రెస్, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా రాష్ట్రానికి వచ్చింది గుండు సున్నా అంటే.. కచ్చితంగా అక్కడ కొట్లాడేటోడు లేకపోవడం. కేసీఆర్ దళం, బలం, గళం లేకపోవడమే దానికి కారణం. మనోళ్లను ఓడగొట్టి.. వేరే వాళ్ల దగ్గర దరఖాస్తు పెట్టుకునే దౌర్భాగ్యం మనకెందుకు..? అదే మనోడు ఉంటే బరాబర్ అడుగుతాం అని కేటీఆర్ పేర్కొన్నారు.
పంచాయతీ ఎన్నికైనా.. పార్లమెంట్ ఎన్నికైనా.. ఎగరాల్సింది గులాబీ జెండానే.. అప్పుడే తెలంగాణ నిలుస్తుంది. గెలుస్తుంది. రేపటి రోజున కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అయితేనే తెలంగాణ అవ్వల్ దర్జాగా నిలుస్తుంది. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఆడబిడ్డలు ప్రజలు బుద్ధి చెప్పాలి. రాబోయే ఉప ఎన్నికల్లో గెలిచి కార్తీక్ రెడ్డి కచ్చితంగా అసెంబ్లీకి వస్తాడని కేటీఆర్ చెప్పారు.
ఇవి కూడా చదవండి..
KTR | తెలంగాణ ఈజ్ డెఫినెట్లీ రైజింగ్.. ఎందులో అంటే..? రేవంత్ పాలనపై కేటీఆర్ సెటైర్లు
KTR | సంతోషం వచ్చినా.. దుఃఖం వచ్చినా కేసీఆర్ను యాది చేసుకుంటున్నారు.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
KTR | చెడు నీ చెవిలో చెబితే రక్తం కారుతది రేవంత్ రెడ్డి.. యాది పెట్టుకో : కేటీఆర్