KTR | హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మంచి మైకులో చెప్పాలి.. చెడు చెవిలో చెప్పాలని రేవంత్ రెడ్డి డైలాగులు కొడుతుండు.. అదే చెడు చెవిలో చెబితే రక్తం కారుతది.. యాది పెట్టుకో రేవంత్ రెడ్డి అని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో రంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. నిన్న రేవంత్ రెడ్డి నాయకత్వంలో గాంధీ భవన్లో కాంగ్రెస్ మీటిగ్ జరిగింది. ఢిల్లీ నుంచి కొత్త ఇంచార్జీకి స్వాగతం పలుకుతూ సమావేశం పెట్టారు. మూడు ఆణిముత్యాల్లాంటి మాటలు చూశాను రేవంత్ రెడ్డి నోటి వెంట. రేవంత్ రెడ్డి సెలవిస్తూ మంచి మైకుల్లో చెప్పాలి.. చెడు చెవుల్లో చెప్పాలని సూచించిండు. మంచి మైకుల్లో చెప్పుదామంటే నువ్వు చేసిన మంచి పని లేదు. మైకుల్లో మంచి చెబుదామన్న కరెంట్ కట్ అయితుంది. చెడు చెవుల్లో చెప్పుడు మొదలుపెడితే హైడ్రా నుంచి మొదలుపెడితే ఆర్ఆర్ ట్యాక్స్, ఎస్ఎల్బీసీ టన్నెల్, పెద్దవాగు, మునిగిన వట్టెం పంప్ హౌజ్ గురించి చెబితే నీ చెవిలో రక్తం కారుతది రేవంత్ రెడ్డి… యాది పెట్టుకో. రేవంత్ రెడ్డి చాలా తెలివిగా చెప్పానని డైలాగులు కొడుతున్నాడు అని కేటీఆర్ విమర్శించారు.
ఇక కొత్త ఇంచార్జి మీనాక్షి మాట్లాడుతూ.. రైల్వేస్టేషన్లో దిగగానే బ్యాగులు మోసేందుకు కొంతమంది కాంగ్రెస్ నేతలు ఉరికొచ్చారని. బ్యాగులు మోసి మీ ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసుకోవద్దని చెప్పారట ఆమె. మీ పక్కన కూర్చొన్నడు బ్యాగులు మోసి మోసి గాడికి వచ్చిండు. అప్పుడు చంద్రబాబు బ్యాగులు మోసిండు.. ఇప్పుడు ఢిల్లీకి బ్యాగులు మోస్తుండు. ఆయనను పక్కన పెట్టుకుని బ్యాగులు మోయొద్దంటే ఆ మేడంకు ఏం చెప్పాలి. మీనాక్షి వాస్తవాలు తెలుసుకోవాలని కోరుతున్నానని కేటీఆర్ పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి మాటలు, కథలు చెప్పరాదు. ఆయన చేసి మంచి చెప్పుకుంటే వడిసిపోదట. ఈ పదిహేను కాలంలో వాట్సాప్‌లు, యూట్యూబ్‌లు చూస్తున్నారు. ఏ ఒక్క ఆడబిడ్డకు పలుకరించినా రేవంత్‌ను ఏకిపారేస్తున్నారు. తెలుగు భాషలో ఇన్ని తిట్లు ఉంటాయని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఏం తిట్లు అవి. రోషం ఉన్నోడు అయితే పాడుబడ్డ బావిలో దూకి చస్తుండే. రేవంత్ రెడ్డి కాబట్టి బ్రహ్మాండంగా బతికేస్తుండు. ఇంకా మంచి చేసిన అని డైలాగులు కొడుతుండు అని కేటీఆర్ మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి..
Jogulamba Temple | మసకబారుతున్న జోగులాంబ ఆలయ ప్రతిష్ఠ.. ఇంతకీ ఏమైందంటే..?
Kollapur | కొల్లాపూర్‌లో ఫ్యాక్షన్ రాజకీయాలు.. బీఆర్ఎస్ నేతలపై మారణాయుధాలతో దాడి
Harish Rao | కొల్లాపూర్‌లో బీఆర్ఎస్ శ్రేణులపై కాంగ్రెస్ గూండాల దాడి దుర్మార్గం : హరీష్ రావు