Harish Rao | కొల్లాపూర్‌లో బీఆర్ఎస్ శ్రేణులపై కాంగ్రెస్ గూండాల దాడి దుర్మార్గం : హరీష్ రావు
Harish Rao | ఏడాది కిందటి వరకు శాంతియుతంగా ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే హింస, నేరాలు పెరిగిపోతున్నాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు.
Harish Rao | హైదరాబాద్ : ఏడాది కిందటి వరకు శాంతియుతంగా ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే హింస, నేరాలు పెరిగిపోతున్నాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని నార్యనాయక్ తండాలో తాజాగా బీఆర్ఎస్ కేడర్‌పై జరిగిన దాడే దీనికి నిదర్శనమని ఆయన చెప్పారు.
కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుందని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణులను ఉసిగొల్పుతూ నిజంగానే మార్పు తెచ్చారు. కాంగ్రెస్ మార్క్ ఎమర్జెన్సీని ఆ పార్టీ కొల్లాపూర్‌లో అమలు చేయిస్తోంది. సాతాపూర్‌లో బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులపై దాడి జరిగి ఒక రోజు గడవక ముందే నార్యానాయక్ తండాలో కాంగ్రెస్ గూండాలు రెచ్చిపోయారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు గర్హనీయం అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు అనుచరుల దాడులు పెరిగిపోతున్నా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రచారం చేసుకునే హక్కు ప్రతిపార్టీకి ఉంటుంది. ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయడం ప్రతిపక్షాల కర్తవ్యం. బీఆర్ఎస్ ఈ పనులు చేస్తుంటే కాంగ్రెస్‌కు జీర్ణం కావడం లేదు. తమ వైఫల్యాలు ప్రజలకు తెలిస్తాయని భయపడుతూ దాడులుకు పాల్పడుతున్నది. బీఆర్ఎస్ ఉద్యమ పార్టీ. ఇలాంటి ఎన్నో అణచివేతలను ఎదుర్కొని నిలిచింది. దాడులకు, కేసులకు మా కార్యకర్తలు భయపడరు. బీఆర్ఎస్ ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటుంది. పోలీసులు నిందితులపై కఠిన చర్యలు తీసుకుని తమ కర్తవ్యం నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాను అని హరీశ్‌రావు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
T PCC | రాహుల్ గాంధీ ఆదేశాల మేరకే తీన్మార్ మల్లన్న సస్పెండ్ : టీ పీసీసీ చీఫ్
Teenmar Mallanna | కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సస్పెన్షన్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ENE Repeat | ‘ఈఎన్ఈ రిపీట్’ అందరూ కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది.. ట్రైలర్ లాంచ్‌లో తరుణ్ భాస్కర్!
Pocket Rockets | నిహారిక కొణిదెల ‘పాకెట్ రాకెట్స్’ టీజర్ విడుదల.. డిసెంబర్ 11న థియేటర్లలో సందడి!
Air Pollution | నగరాల్లో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం.. జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు..
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్‌గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

