Teenmar Mallanna | హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై ఆ పార్టీ వేటు వేసింది. తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 5న తీన్మార్ మల్లన్నకు కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ వ్యతిరేక చర్యలపై మల్లన్నను కమిటీ వివరణ కోరింది. ఫిబ్రవరి 12వ తేదీలోపు వివరణ ఇవ్వాలని మల్లన్నకు కమిటీ గడువు ఇచ్చింది. వివరణ ఇవ్వకపోవడంతో తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ పార్టీ వేటు వేసింది.
Teenmarmallanna1