కేశంపేట, మార్చి 15 : అత్యవసర సమయాల్లో ప్రజలకు అండగా నిలిచే 108 సిబ్బందికి ఆపదొచ్చింది. ఆరు నెలలుగా వేతనాలు రాక కుటుంబ పోషణ భారం గా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ మొండివైఖరి కారణంగా రంగారెడ్డి జిల్లాలోని 32 వాహనాల్లో పని చేస్తున్న 160 కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం నెలకొన్నది.
ప్రభుత్వం ఆరు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో అప్పులతో కుటుం బాలను నెట్టుకొస్తున్నట్టు 108 సిబ్బం ది చెబుతున్నారు. రోజురోజుకూ పెరుగు తున్న నిత్యావసరాలు కొనలేకపోతున్నామని.. పిల్లల చదువులు, ఆటోలకు డబ్బులు, బ్యాంకు రుణాలు చెల్లించకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం సమయానికి వేతనాలు అం దించకపోవడంతోపాటు 108 సిబ్బందికి నిలువ నీడలేని దుస్థితి దాపురించిం ది. అక్కడక్కడ పీహెచ్‌సీల ఆవరణల్లో నిలుపుకొని అంబులెన్స్‌లోనే కాలం వెల్లదీస్తున్నారు. రాత్రీపగలు అనే తేడా లేకుండా విధులు నిర్వహించే 108 సిబ్బంది భోజనం చేసేందుకు సరైన గదుల సౌకర్యం లేకపోవడంతో వాహనాల్లోనే తెచ్చుకున్న బాక్సులను తినాల్సి వస్తున్నది.
ప్రజా పాలన అని చెప్పుకొంటున్న కాంగ్రెస్ పాలనలో పస్తులు ఉండే పరిస్థితి వచ్చింది. రాత్రీపగలు అనే తేడా లేకుండా విధులు నిర్వహి స్తూ ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలుస్తున్న 108 సిబ్బందికి సమయానికి వేతనాలు చెల్లించాలి. ఆరు నెలలుగా సిబ్బంది వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయంటే రాష్ట్రంలో పాలన ఎలా ఉందనేది అర్థమవుతుంది. 108 సిబ్బందికే ఆపదైతే ఎలా? ప్రభు త్వం, జీఎంఆర్ సంస్థ స్పందించి వేతనాలను సకాలంలో చెల్లించేలా నిర్ణయం తీసుకోవాలి. ప్రభుత్వం స్పందించని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతాం.
ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉన్న 108 సిబ్బంది వేతనాలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. వేతనాలు పెండింగ్‌లో ఉండడంతో కుటుంబాలు గడవలేని పరిస్థితి. 108 సిబ్బంది పేద, మధ్య తరగతికి చెందిన వారే కావడంతో ఆర్థిక ఇబ్బం దులతో సతమతమవుతారు. ప్రజలకు అండగా ఉంటున్న సిబ్బంది సేవలను మరిం త వినియోగించుకోవాలంటే ప్రతినెలా 5 లోపు క్రమం తప్పకుండా వేతనాలు అంద జేయాలి. అదేవిధంగా వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి.