మత్స్యకారులకు పరిహారం చెల్లించాలి
అధికారుల సమన్యయలోపంతోనే పెద్ద చెరువుకు గండిపడి చేపలు కొట్టుకుపోయాయని, నష్టపోయిన మత్స్యకారులకు పరిహారం చెల్లించాలని కోరుట్ల ఎమ్మెల్యే డా సంజయ్ కల్వకుంట్ల డిమాండ్ చేశారు. ఇటీవల కురిసిన వర్షాలతో నిండిన పెద్దచెరువుకు గండి పెట్టడంతో నీరు వృథాగా పోయిన విషయం తెలిసిందే.
- అధికారుల అవగాహన లోపంతోనే చెరువుకు గండి
- కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్
- అధికారులతో కలిసి పరిశీలన
మెట్పల్లి, ఆగస్టు4: అధికారుల సమన్యయలోపంతోనే పెద్ద చెరువుకు గండిపడి చేపలు కొట్టుకుపోయాయని, నష్టపోయిన మత్స్యకారులకు పరిహారం చెల్లించాలని కోరుట్ల ఎమ్మెల్యే డా సంజయ్ కల్వకుంట్ల డిమాండ్ చేశారు. ఇటీవల కురిసిన వర్షాలతో నిండిన పెద్దచెరువుకు గండి పెట్టడంతో నీరు వృథాగా పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే మంగళవారం నీటిపారుదలశాఖ, మున్సిపల్ శాఖ ఇంజినీర్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి గండి పడిన ప్రాంతాన్ని పరిశీలించారు. సంబంధిత అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆ శాఖ ఉన్నతాధికారులతో ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడారు. అవగాహన లోపంతో చేసిన పని వల్లే మత్స్యకారులకు తీవ్ర నష్టం జరిగిందని, వెంటనే ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. చెరువు కట్ట (ట్యాంక్ బండ్)ను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలని, అవసరమైన శాశ్వత రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పట్టణ ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.
పెద్దచెరువును యథావిధిగా నీటితో నింపి, పట్టణ ప్రజలను కాపాడాలని సూచించారు. ఇక్కడ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌గౌడ్, మున్సిపల్, నీటి పారుదల శాఖ అధికారులు, బీఆర్ఎస్ నాయకులు పూదరి సుధాకర్‌గౌడ్, మారు సాయిరెడ్డి, అంగడి పురుషోత్తం, ఎండీ జావీద్, ఆకుల ప్రవీణ్, మత్స్యకార సంఘం నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
గరీబ్‌పేట గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
‘సర్ ప్రక్రియపై నిష్పాక్షిక విచారణ జరపాలి’
‘యుద్ధాలతో మానవాళికి అపార నష్టం.. శాంతితోనే ప్రపంచ ప్రగతి’
CJP Protest | ఢిల్లీ పోలీసులు ఎక్కడ అడ్డుకుంటే.. అక్కడ నిరసనలు కొనసాగించండి: అజింక్య షిండే
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

