KTR | హైదరాబాద్ : తెలంగాణ ఈజ్ రైజింగ్ అని సీఎం రేవంత్ రెడ్డి మొత్తుకుంటుండు.. యస్ తెలంగాణ ఈజ్ డెఫినెట్లీ రైజింగ్.. అప్పులు, ఆత్మహత్యలు, క్రైమ్ రేట్లో రైజింగ్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో రంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఈజ్ డెఫినెట్లీ రైజింగ్.. ఎందులో అంటే.. క్రైమ్ రేటులో.. ఈ ఏడాది కాలంలోనే 23 శాతం నేరాలు పెరిగాయి. అప్పుల్లో కూడా తెలంగాణ పెరిగింది. కేసీఆర్ పాలనలో ఏడాదికి 40 వేల కోట్ల అప్పులు చేస్తే.. రేవంత్ రెడ్డి ఒకే ఒక్క ఏడాది.. లక్షా 50 వేల కోట్ల అప్పు చేశారు. ఈ మాట వాస్తవం కాదా..? మరి ఏదైనా కొత్త పథకం ప్రారంభించావా..? రేషన్ కార్డులు, తులం బంగారం, పెన్షన్లు ఇచ్చావా..? రుణమాఫీ చేశావా..? మరి ఎందుకు అప్పు అవుతుంది అని రేవంత్ రెడ్డిని కేటీఆర్ ప్రశ్నించారు.
కేసీఆర్ అప్పు చేసి భవిష్యత్ మీద పెట్టుబడి పెట్టిండు. మరి నువ్వు ఎక్కడికి పంపుతున్నవ్.. ఒక్కటి చక్కగా చేస్తలేవు. ఆత్మహత్యల్లో కూడా తెలంగాణ రైజింగ్. 450 రోజుల్లో 450 మంది రైతులు చనిపోయారు. ఆటో డ్రైవర్లు, నేత కార్మికులు, గురుకుల విద్యార్థుల ఆత్మహత్యల్లో తెలంగాణ రైజింగ్ అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఒక్క దాంట్లో మాత్రం తెలంగాణ డౌన్ అయింది. అదేంటంటే రియల్ ఎస్టేట్. హైడ్రా పెట్టిందే నా కోసమట. 15 నెలల తర్వాత కూడా కేసీఆర్ను తిట్టుకుంటూ బతుకుతావా..? రేవంత్ రెడ్డి. ఎస్ఎల్బీసీ సొరంగం కూలిపోయింది.. అధికారంలోకి వచ్చాక ఆలోచన లేకుండా స్టార్ట్ చేశారు. ఇంజినీర్లను తెలుసుకోకుండా కమీషన్ల కోసంని పనిని ప్రారంభించారు. 8 మంది ఇరుక్కుపోయారు. చనిపోయారు అని ఒకరు.. చనిపోలేదని ఒకరు.. ఇలా మంత్రులు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. బీఆర్ఎస్ వల్లే సొరంగం కూలిపోయిందని అంటున్నరు కొందరు మంత్రులు. ఇదేమీ అన్యాయం అని కేటీఆర్ ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి..
KTR | సంతోషం వచ్చినా.. దుఃఖం వచ్చినా కేసీఆర్ను యాది చేసుకుంటున్నారు.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
KTR | చెడు నీ చెవిలో చెబితే రక్తం కారుతది రేవంత్ రెడ్డి.. యాది పెట్టుకో : కేటీఆర్