KTR | హైదరాబాద్ : కాంగ్రెస్ పాలనలో నీళ్లేమో పాతాళానికి.. నిధులేమో ఢిల్లీకి.. నియామకాలు గాలికి పోయాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో రంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
మనం ఉద్యమకాలంలో నీళ్లు, నిధులు, నియామకాలు అని మాట్లాడుకున్నాం. వాటి సాధనకు కేసీఆర్ ఎంతో కృషి చేశారు. కేసీఆర్ నాయకత్వంలో ఇంటింటికి మంచినీళ్లు తెచ్చుకున్నాం. సాగునీరు అందివ్వడంతో వ్యవసాయ విస్తరణ కూడా జరిగింది. వరి పండించడంలో నంబర్ వన్లో ఉన్నాం. నిధుల విషయంలో.. తలసరి ఆదాయంలో దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా నిలిపాం. సంపద సృష్టించి పేదలకు పంచిండు. ఎన్నో కొత్త ప్రాజెక్టులు నిర్మించాం. నియామకాల విషయానికి వస్తే ప్రభుత్వ రంగంలో 2 లక్షల 32 వేల ఉద్యోగాలు, ప్రయివేటు రంగంలో 24 లక్షల ఉద్యోగాలు సృష్టించారు కేసీఆర్. ఈ మూడింటిలో కేసీఆర్ సంపూర్ణంగా న్యాయం చేశారని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఇవాళ రేవంత్ రెడ్డి పాలనలో నీళ్లు పాతాళానికి పోయాయి. బోర్లు ఎండిపోయాయి. కేసీఆర్ మీద కోపంతో సాగునీరు ఇవ్వకపోవడంతో.. పంటలు ఎండిపోతున్నాయి. నీళ్లేమో పాతాళానికి పోయాయి.. నిధులేమో ఢిల్లీకి పోతున్నాయి. నియామకాలు గాలికి పోయాయి. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు కానీ పత్తా లేవు. రాహుల్ గాంధీ అశోక్ నగర్ వెళ్లి ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు. ఆరు వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. దగ్బులాజీ నాయకత్వం కాంగ్రెస్ పార్టీది అని కేటీఆర్ ధ్వజమెత్తారు.
ఇవి కూడా చదవండి..
KTR | సంతోషం వచ్చినా.. దుఃఖం వచ్చినా కేసీఆర్ను యాది చేసుకుంటున్నారు.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
KTR | చెడు నీ చెవిలో చెబితే రక్తం కారుతది రేవంత్ రెడ్డి.. యాది పెట్టుకో : కేటీఆర్
Kollapur | కొల్లాపూర్లో ఫ్యాక్షన్ రాజకీయాలు.. బీఆర్ఎస్ నేతలపై మారణాయుధాలతో దాడి