Donald Trump | ‘ఏంటో విజయాలన్నీ మాకే దక్కుతున్నాయ్’.. ఎల్ మెంచో హతంపై ట్రంప్ సరదా పోస్ట్..!
Donald Trump | మెక్సికో (Mexico) కు చెందిన మోస్ట్ వాంటెడ్ డ్రగ్ మాఫియా డాన్ (Drug Mafia Don) నెమెసియో ఒసెగుయెరా అలియాస్ ‘ఎల్ మెంచో (El Mencho)’ ను హతమార్చిన ఘనతను పూర్తిగా తన ఖాతాలో వేసుకునేందుకు అమెరికా (USA) ప్రయత్నిస్తోంది.
Donald Trump : మెక్సికో (Mexico) కు చెందిన మోస్ట్ వాంటెడ్ డ్రగ్ మాఫియా డాన్ (Drug Mafia Don) నెమెసియో ఒసెగుయెరా అలియాస్ ‘ఎల్ మెంచో (El Mencho)’ ను హతమార్చిన ఘనతను పూర్తిగా తన ఖాతాలో వేసుకునేందుకు అమెరికా (USA) ప్రయత్నిస్తోంది. కానీ మెక్సికో మాత్రం ఎల్ మెంచో అంతానికి పక్కా ప్లాన్ చేసింది అమెరికా కాదని, తమ స్పెషల్ ట్రూప్స్ అని చెబుతోంది.
ఆదివారం మెక్సికో సైన్యం చేపట్టిన స్పెషల్ ఆపరేషన్‌లో ఎల్ మెంచో హతమయ్యాడు. దీనిపై తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సొంత సోషల్ మీడియా నెట్వర్క్ ట్రూత్ సోషల్‌లో స్పందించారు. ‘ఏంటో అన్నింటిలో మేమే గెలుస్తున్నాం. ఇలా అన్నింటిలో విజయం సాధించడం కూడా న్యాయం కాదు’ అని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా నిఘా వర్గాల సమాచారంతోనే మెక్సికో డ్రగ్ మాఫియా డాన్ ఎల్ మెంచోను మెక్సికో సైన్యం హతమార్చిందని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలిన్ లివిట్ పేర్కొన్న తర్వాత ట్రంప్ ఈ పోస్ట్ చేశారు.
అమెరికాకు మాదకద్రవ్యాలను సరఫరాచేసే వారిపై కఠిన చర్యలు అమలయ్యేలా ట్రంప్ యంత్రాంగం చర్యలు చేపట్టిందని కరోలిన్ లివిట్ చెప్పారు. అందులో భాగంగానే మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో కీలకపాత్ర పోషించిన ఎల్ మెంచోను పట్టుకోవడం కోసం మెక్సికో ప్రభుత్వానికి అమెరికా ఇంటెలిజెన్స్ సహకారం అందించిందని తెలిపారు. అయితే అమెరికా నిఘా వర్గాల సమాచారం మేరకు ఈ ఆపరేషన్‌ను నిర్వహించినట్లు వస్తున్న వార్తలను వాషింగ్టన్‌లోని మెక్సికో రాయబార కార్యాలయం తోసిపుచ్చింది.
డ్రగ్ మాఫియా డాన్‌ను బంధించడానికి చేపట్టిన ఆపరేషన్‌ను మెక్సికన్ ప్రత్యేక దళాలు ప్లాన్ చేసి నిర్వహించాయని తెలిపింది. ఈ విషయంలో అగ్రరాజ్యం కొంత సమాచారం ఇచ్చిన మాట వాస్తవమేనని, కానీ ఆపరేషన్‌లో వారి పాత్ర ఏమీలేదని వెల్లడించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

