మునుగోడు, ఫిబ్రవరి 23 : మునుగోడు మండల పురోహితులు ఉప్పల అభిలాష్ శర్మ, కార్తీక్ శర్మకు హైదరాబాద్ అభినయ కళాక్షేత్రం వారు ఆదివారం ప్రతిష్టాత్మక నంది అవార్డు ప్రదానం చేసి “పురోహిత రత్న” బిరుదుతో ఘనంగా సత్కరించారు. ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు, దేవీ ఉపాసకులు హాజరై అభినందించారు. పురోహిత సేవల ద్వారా ఆధ్యాత్మిక రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న అభిలాష్ శర్మ, కార్తీక్ శర్మకు ఈ గౌరవం దక్కడం మునుగోడు గ్రామానికి గర్వకారణమైంది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ సంప్రదాయాలను పరిరక్షిస్తూ సమాజానికి మార్గనిర్దేశం చేస్తున్న పురోహితులను ప్రోత్సహించడం తమ లక్ష్యమని తెలిపారు.