Aadarsha Kutumbam ak 47 | ఆదర్శ కుటుంబం AK 47 క్రేజీ న్యూస్.. దుబాయ్‌కు వెంకీ- త్రివిక్రమ్ టీం..!
Aadarsha Kutumbam ak 47 | ‘ఆదర్శ కుటుంబం AK 47 ’(Aadarsha Kutumbam -AK 47) చిత్రం నుంచి ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లకు మంచి స్పందన వస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. ఇప్పటివరకు 40 శాతం షూటింగ్ పూర్తవగా వెంకీ టీం దుబాయ్‌కు వెళ్లనుందట.
Aadarsha Kutumbam ak 47 | టాలీవుడ్లో రాబోతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆదర్శ కుటుంబం AK 47’ (Aadarsha Kutumbam -AK 47) విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లకు మంచి స్పందన వస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. ఇప్పటివరకు 40 శాతం షూటింగ్ పూర్తవగా వెంకీ టీం దుబాయ్‌కు వెళ్లనుందట.
10 రోజులపాటు దుబాయ్‌లో సాగనున్న షెడ్యూల్లో కీలక సన్నివేశాలను ప్లాన్ చేసిందట త్రివిక్రమ్ టీం. దుబాయ్‌లో వచ్చే సీన్లు సినిమాను ఎలివేట్ చేసేలా రిచ్‌గా ఉండబోతున్నాయని ఇన్స్డ్ టాక్. అంతేకాదు ఈ మూవీలో పాపులర్ తమిళ కమెడియన్ యోగిబాబు కూడా నటిస్తున్నట్టు తెలుస్తోండగా.. మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అన్నీ అనుకున్నట్టుగా కుదిరితే సినిమా షూటింగ్ జూన్ కల్లా ప్తూర్తి కానుందని సమాచారం.
ఇప్పటికే ‘నువ్వు నాకు నచ్చవ్’, ‘మల్లీశ్వరి’ వంటి హిట్ చిత్రాలకు రైటర్–హీరో కాంబోగా కలిసి పనిచేసిన త్రివిక్రమ్-వెంకీ ఇప్పుడు డైరెక్టర్–హీరోగా మొదటిసారి చేతులు కలపడంతో సినిమాపై క్యూరియాసిటీ పెరిగిపోతుంది. ఇటీవల విడుదలైన టైటిల్ అనౌన్స్మెంట్, ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేస్తున్నాయి.
ఈ సినిమాలో కేజీఎఫ్ ఫేం శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తుండగా, నారా రోహిత్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ మూవీని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తోపాటు క్రైం ఎలిమెంట్స్‌తో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది.
Read Also :
The Paradise | ‘ది ప్యారడైజ్’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘ఆయా షేర్’ ప్రోమో రిలీజ్.. నాని ఎనర్జీ చూసి షాక్!
Nani | మాస్ మోడ్‌లో నాని.. ‘బ్లడీ రోమియో’లో నేచురల్ స్టార్ సరసన బాలీవుడ్ బ్యూటీ?
MSG | ‘మన శంకర వరప్రసాద్ గారు’ సూపర్ సక్సెస్ – రీజినల్ ఇండస్ట్రీ హిట్‌గా సంచలనం!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
NXTinAI | వెండితెరపై కృత్రిమ మేధ హవా.. గ్యాలరీ5 ‘నెక్ట్స్ఇన్ఏఐ’ సదస్సు
PM Modi | ప్రభుత్వం మారినా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.. తమిళనాడులో ప్రధాని మోదీ
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

