Drunk Techie Fires Air Gun | 45 నిమిషాల పాటు ఎయిర్ గన్‌తో టెకీ కాల్పులు.. పోలీసులు అరెస్ట్
Drunk Techie Fires Air Gun | ఐటీ సంస్థలో పని చేసే టెకీ మద్యం సేవించి హల్చల్ చేశాడు. మొబైల్ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ ఆగ్రహం చెందాడు. అపార్ట్మెంట్ బాల్కానీ నుంచి ఎయిర్ గన్‌తో 45 నిమిషాల పాటు కాల్పులు జరిపాడు.
బెంగళూరు: ఐటీ సంస్థలో పని చేసే టెకీ మద్యం సేవించి హల్చల్ చేశాడు. మొబైల్ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ ఆగ్రహం చెందాడు. అపార్ట్మెంట్ బాల్కానీ నుంచి ఎయిర్ గన్‌తో 45 నిమిషాల పాటు కాల్పులు జరిపాడు. అక్కడకు చేరుకున్న సెక్యూరిటీ గార్డుల వైపు కూడా కాల్పులు జరిపాడు. ఈ సమాచారం తెలుస్తున్న పోలీసులు ఆ టెకీని అరెస్ట్ చేశారు. (Drunk Techie Fires Air Gun) కర్ణాటక రాజధాని బెంగళూరు శివారులోని అనెకల్లో ఈ సంఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన 40 ఏళ్ల అనురాగ్ తివారీ, బెంగళూరులోని సాఫ్ట్వేర్ కంపెనీలో ఐటీ నిఫుణుడిగా పని చేస్తున్నాడు. బందాపూర్ సమీపంలోని సిపానీ అపార్ట్మెంట్ కాంపెక్స్‌లోని ఒక ఫ్లాట్‌లో గత ఎనిమిది నెలలుగా అద్దెకు నివసిస్తున్నాడు.
కాగా, ఆ ఫ్లాట్‌లో అతిగా మద్యం సేవించిన అనురాగ్ తివారీ, మొబైల్ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ పెద్దగా అరవసాగాడు. ఆ తర్వాత బాల్కనీలోకి వచ్చి ఎయిర్ గన్‌తో పెల్లెట్లను కాల్చడం ప్రారంభించాడు. పార్క్ చేసిన కార్లు, మెటల్ షీట్లను ఆ పెల్లెట్లు తాకాయి. కాల్పుల శబ్దం విన్న సెక్యూరిటీ గార్డులు పరుగున అక్కడకు చేరుకున్నారు. వారి వైపు కూడా తివారీ కాల్పులు జరుపడంతో భయాందోళన చెందారు.
మరోవైపు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకున్నారు. సుమారు 45 నిమిషాల పాటు ఎయిర్ గన్‌తో కాల్పులు జరిపి హల్చల్ చేసిన అనురాగ్ తివారీని అరెస్ట్ చేశారు. నిందితుడు ఉపయోగించిన ఎయిర్ గన్, పెల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సూర్య నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

