SRK | 9 ఏళ్ల వయసులో కసబ్‌పై సాక్ష్యం చెప్పే ధైర్యం ఎలా వచ్చింది?.. 26/11 బాధితురాలిని ప్రశ్నించిన షారుఖ్ ఖాన్!
ShahRukhKhan | ముంబైలో జరిగిన 'గ్లోబల్ పీస్ ఆనర్స్ 2026' (Global Peace Honours 2026) వేదికపై బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్, 26/11 ముంబై ఉగ్రదాడుల బాధితురాలు దేవికా రోటవాన్ మధ్య జరిగిన భావోద్వేగ సంభాషణ అందరినీ కదిలించింది.
ముంబైలో జరిగిన ‘గ్లోబల్ పీస్ ఆనర్స్ 2026’ (Global Peace Honours 2026) వేదికపై బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్, 26/11 ముంబై ఉగ్రదాడుల బాధితురాలు దేవికా రోటవాన్ మధ్య జరిగిన భావోద్వేగ సంభాషణ అందరినీ కదిలించింది. 2008 ముంబై ఉగ్రదాడుల్లో ప్రాణాలతో బయటపడిన అత్యంత పిన్న వయస్కురాలైన ప్రత్యక్ష సాక్షిగా, ఉగ్రవాది అజ్మల్ కసబ్‌కు ఉరిశిక్ష పడటంలో కీలక పాత్ర పోషించిన దేవికా రోటవాన్‌ను నవంబర్ 21న జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె ధైర్యసాహసాలకు గాను ప్రత్యేకంగా సత్కరించారు.
ఈ సందర్భంగా వేదికపై దేవికతో మాట్లాడిన షారుఖ్ ఖాన్, కేవలం తొమ్మిదేళ్ల చిన్న వయసులోనే కోర్టుకు వెళ్లి కసబ్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పే అంతటి ధైర్యం ఆమెకు ఎలా వచ్చిందని ఆసక్తిగా ప్రశ్నించారు.
షారుఖ్ ప్రశ్నకు దేవికా రోటవాన్ స్పందిస్తూ.. ఆనాటి భయానక జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఉగ్రదాడిలో గాయపడి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత తాము రాజస్థాన్‌లోని తమ స్వగ్రామానికి వెళ్లిపోయామని తెలిపారు. కొంతకాలం తర్వాత ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారుల నుంచి తమకు ఫోన్ వచ్చిందని, కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పగలరా అని అడిగారని చెప్పారు. మా నాన్న ఇద్దరు ఉగ్రవాదులను చూశారు, నేను కసబ్‌ను చూశాను. అందుకే మేము సాక్ష్యం చెప్పడానికి వెంటనే సిద్ధమయ్యాము అని దేవిక వివరించారు.
అంతటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనే బలాన్ని తన తండ్రే తనకు ఇచ్చారని దేవిక పేర్కొన్నారు. ఆ ధైర్యం నాకు మా నాన్న నుంచే వచ్చింది. సత్యం మార్గంలో నడిచేటప్పుడు ఎక్కడో ఒకచోట కష్టాలు ఎదురవుతాయి, కానీ వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని ఆయన ఎప్పుడూ చెప్పేవారు. ఒకరి ముందు తలవంచి చనిపోవాలా లేక పోరాడి చనిపోవాలా అనేది ఎప్పుడూ మన చేతుల్లోనే ఉంటుందని, దాన్ని మనమే నిర్ణయించుకోవాలని ఆయన నాకు నేర్పారు అని దేవిక చెప్పుకోచ్చింది. 2008 నవంబర్ 26న ముంబైలోని పలు ప్రాంతాల్లో పాకిస్థాన్ ఉగ్రవాదులు జరిపిన మారణహోమంలో ప్రాణాలతో బయటపడిన దేవిక, ఆ దాడిలో సజీవంగా పట్టుబడిన ఏకైక ఉగ్రవాది అజ్మల్ కసబ్‌ను కోర్టులో గుర్తించి, అతడికి కఠిన శిక్ష పడటంలో ప్రధాన సాక్షిగా నిలిచారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SRK | 9 ఏళ్ల వయసులో కసబ్‌పై సాక్ష్యం చెప్పే ధైర్యం ఎలా వచ్చింది?.. 26/11 బాధితురాలిని ప్రశ్నించిన షారుఖ్ ఖాన్!
IND vs NZ | పంత్ సెంచరీ.. న్యూజిలాండ్‌పై భారత్ పట్టు.. చివరి రోజు 8 వికెట్లు తీస్తే చాలు!
Vrushakarma | రిలీజ్ వాయిదా రూమర్లకు చెక్.. వృశకర్మ ట్రైలర్ వచ్చేది ఎప్పుడంటే?
Yadagirigutta | యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తజనం.. ధర్మ దర్శనానికి 3 గంటల సమయం.
పెళ్లయిన తెల్లారే కొత్త పెళ్లికూతురికి ప్రసవం.. షాక్‌లో పెళ్లికొడుకు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

