Jos Buttler | టీ20 క్రికెట్ చాలా మారింది.. నా ‘ఆల్‌టైమ్ రికార్డు’ను వైభవ్ బ్రేక్ చేస్తాడు..!
Jos Buttler : పొట్టి క్రికెట్లో పిడుగల్లే చెలరేగే వైభవ్ టీ20ల్లో అత్యధిక స్కోర్ రికార్డును అధిగమించడం ఖాయమని చెబుతున్నాడు జోస్ బట్లర్(Jos Buttler).
Jos Buttler : అంతర్జాతీయ క్రికెట్లోనూ సత్తా చాటుతున్న వైభవ్ సూర్యవంశీ(Vaibhav Sooryavanshi) ఇప్పటికే తానెంత ప్రమాదకరమో చాటుకున్నాడు. జింబాబ్వే పర్యటనలో విజయవంతమైన ఈ కుర్రాడు భవిష్యత్‌లో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టేయడం పక్కా అంటున్నారు విశ్లేషకులు. పొట్టి క్రికెట్లో పిడుగల్లే చెలరేగే వైభవ్ టీ20ల్లో అత్యధిక స్కోర్ రికార్డును అధిగమించడం ఖాయమని చెబుతున్నాడు జోస్ బట్లర్(Jos Buttler). ఎవరో ఒకరు నా రికార్డును అధిగమిస్తారు. అయితే.. అందుకు వైభవ్‌కే ఎక్కువ అవకాశముంది అని అంటున్నాడీ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్.
టీ20ల్లో తుఫాన్ బ్యాటింగ్‌తో అలరిస్తున్న వైభవ్ సూర్యంశీ ఆటకు జోస్ బట్లర్ ఫిదా అవుతున్నాడు. విధ్వంసక ఓపెనర్‌గా ఎన్నో ధనాధన్ ఇన్నింగ్స్‌లు ఆడిన బట్లర్.. ది హండ్రెడ్ లీగ్‌లో మెరుపు అర్ధ శతకం బాదాడు. దాంతో, టీ20ల్లో కీరన్ పొలార్డ్ పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డును పట్టేశాడీ మాజీ కెప్టెన్. ప్రస్తుతం బట్లర్ ఖాతాలో 14,833కు పైగా రన్స్ ఉన్నాయి. అయితే.. తన రికార్డు ఏమంత పదిలం కాదని, భవిష్యత్‌లో ఎవరో ఒకరు తనను అధిగమిస్తారని చెప్పాడీ డాషింగ్ బ్యాటర్.
Which side are you on: The Hundred should be included in T20 stats or not? 😀 pic.twitter.com/plRwtm9ryg
— Cricinfo (@cricinfo) August 6, 2026
‘ఎందరో ఉండగా టీ20ల్లో అత్యధిక పరుగులు చేయడం చాలా మంచి విషయం. అయితే.. ఏదో ఒకరోజు ఒకరు.. బహుశా వైభవ్ సూర్యవంశీనే నా ఆల్‌టైమ్ రికార్డును అధిగమించవచ్చు. ఈమధ్య కాలంలో క్రికెట్ చాలా మారింది. నన్నే తీసుకోండి.. ఒకసారి బాగా ఆడుతున్నా. ఒకసారి విఫలమవుతున్నా. గత కొన్ని వారాలుగా నేను బాగా ఆడుతున్నా. చెప్పాలంటే నా స్టయిల్ ఆటతో చెలరేగుతున్నా. క్రికెట్లో మనం రెండే చేయగలం. ఒకటి వీడ్కోలు పలకడం. రెండోది మన లోపాలను సరిచేసుకొని ఫామ్ అందుకోవడం’ అని స్కై స్పోర్ట్స్‌తో వెల్లడించాడు 34 ఏళ్ల బట్లర్.

ప్రస్తుతం టీ20ల్లో బట్లర్ 14,833 రన్స్‌తో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మాజీ ఆటగాళ్లు పొలార్డ్ 14,803, క్రిస్ గేల్ 14,562 పరుగులు, అలెక్స్ హేల్స్ 14,449, డేవిడ్ వార్నర్ 14,284 రన్స్ సాధించారు. వైభవ్ విషయానికొస్తే.. ఫ్రాంచైజీ, అంతర్జాతీయ టీ20ల్లో ఈ చిచ్చరపిడుగు 40 ఇన్నింగ్స్‌ల్లోనే ఏకంగా 1,670 పరుగులు బాదేశాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భూమి పూజ
CJP protest | సీజేపీ నిరసన కోసం అన్నింటినీ బంద్ చేయొద్దు.. కేంద్రానికి సూచించిన సుప్రీంకోర్టు
Ravindra Jadeja | మళ్లీ రంజీ ట్రోఫీలో జడేజా.. టెస్టు సన్నద్ధత అదిరేనా..!
ప్రజల వద్దకే పాలన కోసం జిల్లాలు ఏర్పాటు : గొంగిడి సునీతామహేందర్ రెడ్డి
Wife Stabs Husband’s Private Part | వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో.. భర్త ప్రైవేట్ భాగంపై కత్తితో భార్య దాడి
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

