అర్వపల్లి, ఆగస్టు 06 : పిల్లలకు తల్లిపాలే శ్రేయస్కరమనిర అర్వపల్లి మండలం కోమటిపల్లి సర్పంచ్ నున్న యాదగిరి అన్నారు. గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో గురువారం తల్లిపాల వారోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. తల్లిపాలే ఉత్తమమైన ఆహారమని, పిల్లల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, ఆరోగ్యంగా ఉండాలంటే పిల్లలకు తప్పనిసరిగా తల్లిపాలు తాగించాలరన్నారు. అంగన్వాడీ సెంటర్ లో అందించే పౌష్టికాహారాన్ని పిల్లలు, తల్లులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గర్భిణీలకు శ్రీమంతం, పిల్లలకు అన్న ప్రాసన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ తొడుసు శివరంజని, సూపర్వైజర్ స్వప్న, ఉప సర్పంచ్ గోవర్ధన్, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం ఉల్లెందుల సైదులు, ఉపాధ్యాయురాలు సృజన, వార్డ్ మెంబర్ శిరీష, ఆయా పద్మ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.