చండూరు, ఆగస్టు 06 : ఇరుకుగా ఉన్న రోడ్లను డబుల్ రోడ్డుగా మార్చాలని తెలంగాణ ఉద్యమకారుడు కళ్లెం సురేందర్ రెడ్డి అన్నారు. చండూరు మున్సిపాలిటీ నుండి లకినేనిగూడెం, గుండ్రపల్లి రోడ్డులో ఉన్న హై స్కూల్, తాసీల్దార్, డిగ్రీ కళాశాల, ఆర్డీఓ, ఎంపీడీఓ కార్యాలయాల సింగిల్ రోడ్డును డబుల్‌గా మార్చాలని ఆయన అన్నారు. ఈ రోడ్డు సింగల్ రోడ్డు గా ఉండడంతో ఇరువైపులా వాహనాలు నిలపడంతో ఎల్లప్పుడూ రద్దీగా ఉండి ఎప్పుడు ఏ ప్రమాదాలు జరుగుతాయో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. సింగిల్ రోడ్డుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, విద్యార్థులు, ఉద్యోగస్తులు, ఆఫీసులో పని కోసం వచ్చే వారితో నిత్యం రద్దీగా ఉంటుందని, ఇంటికెళ్లేలోపు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని భయాందోళనలు చెందుతున్నారన్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగక ముందే డబుల్ రోడ్డు పనులు చేపట్టాలని కోరారు.