చెడు నుంచి మంచి వైపుకు..
‘పుష్ప’ ఫ్రాంఛైజీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు మలయాళ అగ్ర హీరో ఫహాద్ ఫాజిల్. ఆయన నటిస్తున్న తొలి స్ట్రెయిట్ తెలుగు చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్'. శశాంక్ ఏలేటి దర్శకుడు. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్ఎస్ కార్తికేయ నిర్మాతలు. అక్టోబర్ 2న సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శనివారం ఫహాద్ ఫాజిల్ విలేకరులతో సినిమా సంగతుల్ని పంచుకున్నారు.
‘పుష్ప’ ఫ్రాంఛైజీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు మలయాళ అగ్ర హీరో ఫహాద్ ఫాజిల్. ఆయన నటిస్తున్న తొలి స్ట్రెయిట్ తెలుగు చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. శశాంక్ ఏలేటి దర్శకుడు. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్ఎస్ కార్తికేయ నిర్మాతలు. అక్టోబర్ 2న సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శనివారం ఫహాద్ ఫాజిల్ విలేకరులతో సినిమా సంగతుల్ని పంచుకున్నారు.
- దర్శకుడు శశాంక్ వచ్చి కథ చెప్పిన వెంటనే ఓకే చెప్పాను. నా జీవితంలో ఇలాంటి కథను వినలేదు. అంత బాగా నచ్చింది. ఈ కథలో ప్రేమ, ఆప్యాయత, అనుబంధం వంటి చాలా అంశాలుంటాయి. ఓ లోతైన ఫిలాసఫీ ఉంటుంది. జీవితం గురించి చాలా విషయాలు చెబుతుంది.
- ఈ సినిమాలో నేను సూరి అనే స్ట్రీట్ మేజిషియన్ పాత్రలో కనిపిస్తా. మాయలు, ట్రిక్స్తో జీవనం సాగిస్తుంటాను. ఓ చిన్నారి కారణంగా అతని జీవితం పూర్తిగా మారిపోతుంది. చెడు నుంచి మంచి వైపుకు సాగే అతని ప్రయాణమే ఈ సినిమా కథ. సూరి పాత్రను ప్రతీ ఒక్కరూ ఇష్టపడతారు. బాలనటి సారా అద్భుతమైన పర్ఫార్మెన్స్ కనబరచింది.
- గత ఏడాదిన్నరగా హైదరాబాద్లోనే ఉంటున్నా. ఎంతో మంది ఫ్రెండ్స్ అయ్యారు. తెలుగు కొంచెం మాట్లాడగలుగుతున్నా. ఈ సినిమాలో నా పాత్రకు తెలుగులో నేనే డబ్బింగ్ చెప్పాను. మ్యూజిక్ ఈ సినిమాలో ఓ క్యారెక్టర్లా అనిపిస్తుంది. కాలభైరవ సంగీతం ప్రధానాకర్షణగా నిలుస్తుంది.
- ఈ సినిమా టైటిల్ బాలకృష్ణగారి సినిమాలోని డైలాగ్ అని తెలుసు. ఈ టైటిల్ పెట్టే క్రమంలో బాలకృష్ణగారిని కలిశాం. తెలుగు పరిశ్రమలోకి నాకు స్వాగతం అంటూ ఆప్యాయంగా మాట్లాడారు. సినిమాలోని కొన్ని సీన్స్ చూసి ఆయన బాగా ఎంజాయ్ చేశారు.
- నేను ఇంజనీరింగ్ డ్రాపవుట్ని. నా మొదటి సినిమా ఫ్లాప్ తర్వాత అమెరికా వెళ్లాను. అక్కడే ఉండిపోదామనుకున్నా. అయితే ఆరేళ్ల సమయంలో అక్కడ నేను కలిసిన వ్యక్తులు, ప్రపంచ సినిమాతో పరిచయం, చదివిన పుస్తకాలు నా దృక్పథాన్ని మార్చాయి. ఇండియాకు తిరిగొచ్చి మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యా. ఇప్పటికే 66 చిత్రాలు పూర్తయ్యాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power crisis | కాంగ్రెస్ చేతకాని పాలనతో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం : మాజీ ఎమ్మెల్యే గండ్ర
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

