చౌటుప్పల్ రూరల్, ఫిబ్రవరి 23 : చౌటుప్పల్ మండలం రెడ్డిబావి గ్రామంలో ఆదివారం రాత్రి ఎలక్ట్రిక్ స్కూటర్ దగ్ధం అయ్యింది. గ్రామానికి చెందిన నందగిరి రమేశ్ మూడు సంవత్సరాల క్రితం కొనుగోలు చేసిన సిగ్మా విక్స్ కంపెనీకి చెందిన స్కూటీపై ఆదివారం ప్రయాణం చేసి ఇంటిముందు పార్కింగ్ చేశాడు. తెల్లవారుజామున బ్యాటరీ పేలి ఒక్కసారిగా మంటలు రావడంతో గమనించిన కుటుంబ సభ్యులు మంటలు అర్పివేశారు.