తిరుమల : తిరుమల లడ్డూ ( Laddu ) కల్తీ నెయ్యి కేసుపై ఏపీ ప్రభుత్వం వేసిన ఏకసభ్య కమిటీని ( One-member committee ) సవాల్ చేస్తూ సుబ్రహ్మణ్యస్వామి ( Subramanian Swamy) వేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు ( Supreme Court ) కొట్టి వేసింది. ఏకసభ్య కమిటీ ఏర్పాటు తప్పు కాదని స్పష్టం చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ ఓవర్లాపింగ్ కిందకు రాదని వెల్లడించింది. పరిపాలనాపరమైన లోపాల గుర్తింపునకు ఏర్పాటుచేసిందని వివరించింది. రాజ్యాంగ పదవుల్లోనివారు ఈ వ్యవహారంపై మాట్లాడకుండా నిలువరించాలని సుబ్రహ్మణ్య స్వామి తరఫు న్యాయవాది వినతిని కోర్టు తోసిపుచ్చింది .
కోర్టు పరిధిలో ఉన్నందున ప్రభావం చూపే పరిస్థితి లేదని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయడం సిట్ దర్యాప్తునకు వ్యతిరేకం కాదని వివరించింది. పిటిషనర్ వ్యక్తం చేసిన అనుమానాలకు ఆధారాలు లేవని పేర్కొంది. రెండుకార్యక్రమాలు చట్టపరంగా కొనసాగాలని సూచించింది. కోర్టు ఆదేశాల మేరకు వేసిన సిట్ నివేదిక ఆదారంగా ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేసింది.