KTR : నల్లగొండలో రైతు ధర్నా (Raithu dharna) ను అడ్డుకునేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) అన్ని ప్రయత్నాలు చేశాడని, ఆఖరికి దివ్యాంగుడు అయిన బీఆర్ఎస్ నాయకుడు భూపాల్‌రెడ్డి (Bhupal Reddy) పై పోలీస్‌స్టేషన్‌లో దాడి చేసిండ్రని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS working president) కేటీఆర్ (KTR) ఆరోపించారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి సిగ్గుందా అని తాను అడుగుతున్నానని ఆయన మండిపడ్డారు. నల్లగొండ గడ్డ నాడు సాయుధ రైతాంగ పోరాటానికి రాష్ట్ర రైతుల్లో స్ఫూర్తి నింపిందని, ఇప్పుడు కూడా రైతులు తిరగబడేందుకు నల్లగొండనే వేదిక కావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
‘పోరాటాల పురిటిగడ్డ నల్లగొండ ఆనాడు మొత్తం రాష్ట్ర రైతాంగానికి సాయుధపోరాటంలో ఎట్లైతే స్ఫూర్తిని నింపిందో.. మళ్ల ఇప్పుడు గూడా అట్లనే నల్లగొండనే స్ఫూర్తి కావాలె. రైతులు తిరగబడుతందుకు నల్లగొండనే వేదిక కావాలె. అందుకే నల్లగొండ నుంచే ఈ రైతు పోరు మొదలుపెట్టినం. ఇంకా నాలుగేండ్ల సమయం ఉంది. మిమ్మల్ని అందరినీ నేను ప్రార్థించేది ఒక్కటే. కాంగ్రెస్‌కు గట్టిగా బుద్ధిచెప్పాలె. కేసీఆర్ తయారు చేసిన అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు అందరూ మీకు మద్దతు ఉంటరు. ఈ ప్రభుత్వంలో రైతుబంధు అడిగితే చెప్పుతో కొడుతా అనే మంత్రి ఒకడున్నడు. మీటింగ్ పెట్టుకుంటమంటే అడ్డుకునే సన్నాసి మంత్రి ఒకడున్నడు. భూపాల్‌రెడ్డిని తీస్కపోయి పోలీస్స్టేషన్ల దాడి చేసిండు. నీకు సిగ్గుందా అని అడుగుతున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి’ అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘నీకు ధైర్యం ఉంటే, దమ్ముంటే గడియారం సెంటర్‌కు రా. మా లెక్కనే వచ్చి మీటింగ్ పెట్టి రైతులకు మీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పు’ అని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి కేటీఆర్ సవాల్ చేశారు. ‘ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డిలకు ఆకారాలు బాగా పెరిగినయ్. అహంకారాలు బాగా పెరిగినయ్. కానీ నల్లగొండకు వాళ్లు చేసిందేమీ లేదు. కానీ కేసీఆర్ ఏం చేసిండని మాట్లాడుతరు. కేసీఆర్ ఏం చేసిండో చెప్తున్నా. వరి ధాన్యం ఉత్పత్తిలో రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ చేసిండు. నల్లగొండను తెలంగానలోనే నెంబర్ వన్ చేసిండు. సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రిలో మూడు మెడికల్ కాలేజీలు కట్టిచ్చిండు. యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్ది లక్ష్మీ నరసింహస్వామి రుణం తీర్చుకున్నడు. దామరచర్లలో తెలంగాణలోనే అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని కట్టిచ్చిండు. చెప్పుకుంటే పోతే ఒకటి రెండు కాదో ఎన్నో పనులు చేసినం. దమ్ముంటే క్లాక్ టవర్‌కు రా.. మా భూపాలన్న, జగదీష్ అన్న వస్తరు. నీ సంగతి చెప్తరు’ అని కేటీఆర్ హెచ్చరించారు.
‘మనం హైకోర్టుకు ధన్యవాదాలు చెప్పాలె. మన న్యాయవ్యస్థకు ధన్యవాదాలు చెప్పాలె. ఎందుకంటే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేసినా, రైతుల పోరాటంలో న్యాయం ఉందని అర్థం చేసుకుని ఇయ్యాల మనం ధర్నా చేసుకునేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. సీఎం రాజ్‌భవన్ ముందు ధర్నా చేస్తే ట్రాఫిక్‌కు ఇబ్బంది కాదటగానీ, మనం ఇక్కడ ధర్నా చేస్తే ప్రభుత్వానికి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఇబ్బంది అయితదట. నేను పోలీస్ అధికారులకు, జిల్లా అధికార యంత్రాంగానికి గుర్తుచేస్తున్న. మరిచిపోకండి. భవిష్యత్తు కచ్చితంగా గులాబీ జెండాదే. ముమ్మాటికి తిరిగివస్తాం. ఇయ్యాల ఎవరైతే కాంగ్రెస్ కార్యకర్తల కంటే అతిగా ప్రవర్తిస్తున్నరో అన్ని గుర్తుపెట్టుకుంటున్నం. వడ్డీతో సహా ఇస్తం. యాదికి పెట్టుకోండి’ అని కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు.
KTR | రైతుబంధు కొనసాగిస్తే ఆయననెవరూ దేకరని రేవంత్‌రెడ్డి భయం : కేటీఆర్
KTR | రేవంత్‌రెడ్డి దృష్టిలో మోసం చేసుడు కూడా చారిత్రాత్మకమే : కేటీఆర్
KTR | నల్లగొండ బిడ్డల బొక్కల్లో మూలుగ చావడానికి కారణం కాంగ్రెస్ : కేటీఆర్
KTR | వరి పంటలో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ చేసిండ్రు కేసీఆర్ : కేటీఆర్
KTR | ప్రపంచంలో ప్రజాశక్తి కంటే గొప్పదేదీ లేదని రుజువు చేసిన గడ్డ నల్లగొండ : కేటీఆర్
KTR | రైతు ధర్నాకు వచ్చినట్లు లేదు.. విజయోత్సవ ఊరేగింపులా ఉంది : కేటీఆర్
HFEA | కృత్రిమ వీర్యం.. నచ్చిన రూపం.. ఆ అవసరం లేకుండానే సంతానం!