KTR : ఈ ప్రపంచంలో ఏ శక్తీ ప్రజా శక్తి కంటే గొప్పది కాదని, ఆ విషయాన్ని రుజువు చేసిన గడ్డ ఈ పోరాటాల నల్లగొండ (Nallagond) అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS working president) కేటీఆర్ (KTR) కొనియాడారు. మంగళవారం నల్లగొండ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన రైతు ధర్నా (Raithu Dharna) కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఇయ్యాల ఇక్కడి నుంచి అధికారంలో ఉన్నోళ్లు చక్రవర్తుల లెక్క, రారాజుల లెక్క విర్రవీగుతున్నరని, తాను పోరాట వీరులంటున్నది వాళ్లను కాదని అన్నారు. అప్పటి నియంత పాలకుడికి వ్యతిరేకంగా, ధైర్యంగా పోరాటం చేసిన వారి గురించి మాట్లాడుతున్నానని చెప్పారు.
‘ప్రపంచంలో ఏ శక్తి గూడా ప్రజాశక్తి కంటే గొప్పది కాదు. అది రుజువు చేసిన గడ్డ ఈ పోరాటాల గడ్డ నల్లగొండ అని నేను గుర్తు చేస్తున్నా. ఇయ్యాల అధికారంలోకి వచ్చినోళ్లు చక్రవర్తులు, రారాజుల లెక్క విర్రవీగుతున్నరు. వాళ్ల గురించి కాదు నేను చెబుతున్నది. ఆనాడు ‘బండెనక బండి గట్టి.. పదహారు బండ్లుగట్టి ఏ బండ్లే పోతవ్ కొడుకో నైజాము సర్కరోడా’ అని అప్పటి నియంతను నిలదీసిన గడ్డ నల్లగొండ. అప్పటి పోరాట వీరులను గురించి నేను మాట్లాడుతున్న. పోరాటానికి స్ఫూర్తి అయిన నల్లగొండ గడ్డకు వందనం. రైతు ధర్నాకు విచ్చేసిన ప్రతి నల్లగొండ రైతు బిడ్డకు శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నా’ అని కేటీఆర్ అన్నారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే.. ‘సోదరుడు రసమయి బాలకిషన్ ఇక్కడికి వచ్చేటప్పుడు ఓ మాట చెప్పిండు. అన్న ఒక మాట నువు నల్లగొండల తప్పకుండా యాది జెయ్యాలె అన్నడు. ఒకనాడు కేసీఆర్ స్వయంగా పాట రాసిండు. ‘పక్కన కృష్ణమ్మ ఉన్న ఫలితమేమి లేకపాయె.. పాలమూరు, నల్లగొండ పంటలన్ని ఎండిపాయె’ అంటూ నల్లగొండ దుస్థితి గురించి జలసాధన ఉద్యమ సమయంలో పాట రాసిన సంగతి గుర్తుచేసిండు. ఇంతలో నల్లగొండ ఫ్లోరైడ్ దుస్థితి గురించి కూడా కేసీఆర్ పాట రాసిన విషయాన్ని నిరంజన్ రెడ్డి గుర్తుచేసిండ్రు. ‘సూడు సూడు నల్లగొండ.. గుండె నిండా ఫ్లోరైడ్ బండ’ అంటూ పాట రాసిన సంగతి గుర్తుకు తెచ్చిండ్రు’ అని కేటీఆర్ వెల్లడించారు.
KTR | రైతు ధర్నాకు వచ్చినట్లు లేదు.. విజయోత్సవ ఊరేగింపులా ఉంది : కేటీఆర్
HFEA | కృత్రిమ వీర్యం.. నచ్చిన రూపం.. ఆ అవసరం లేకుండానే సంతానం!
Custodial Death | లాకప్ డెత్ కేసు.. ఐజీ సహా 8 మంది పోలీసులకు జీవితఖైదు
Crime news | దగ్గరి బంధువుతో సహజీవనం.. కాలిన సూట్‌కేసులో మహిళ మృతదేహం..!
Snow Sculpture | ఆ మంచు శిల్పాలు అదుర్స్.. పోటీలో భారత్‌కు కాంస్యం.. Video