Snow Sculpture : శిల్పం (Sculpture) అంటేనే అందం (Beauty). అందుకే అందమైన మగువను కవులు శిల్పాలతో పోలుస్తారు. శిల్పులు తమ సమయాన్ని శ్రమను దారపోసి అందమైన శిల్పాలకు రూపం ఇస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పేరెన్నికగన్న రాతి శిల్పాలు (Stone sculpture), లోహ శిల్పాలు (Metal sculpture) ఉన్నాయి. అయితే రాతి, లోహ శిల్పాల గురించి దాదాపు అందరికీ తెలుసు. కానీ మంచు శిల్పాల (Snow Sculpture) గురించి బహుశా చాలా మందికి తెలియదు. కానీ తెల్లటి మంచుతో చేసిన శిల్పాలను చూసేందుకు మనకు రెండు కళ్లు చాలవు.
అమెరికా (USA) లోని కొలరాడో (Colorado) రాష్ట్రంలో ప్రతి ఏటా జనవరి నెల ఆఖరులో అంతర్జాతీయ స్నో స్కల్ప్చర్ ఛాంపియన్షిప్ (International Snow Sculpture Championship) నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది కూడా ఈ ఛాంపియన్షిప్ జరిగింది. ఈ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు కాంస్య పతకం (Bronze Medal) దక్కింది. ఈ పోటీల్లో టీమ్ కెప్టెన్ జహూర్ అహ్మద్ (Zahoor Ahmad), చెవిటి, మూగవాడు అయిన స్నో కళాకారుడు (Suhail Mohammad Khan) భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు.
ఈ పోటీల్లో తాము కాంస్యం గెలుచుకోవడం ఆనందంగా, గర్వంగా ఉందని ఇండియా టీమ్ కెప్టెన్ జహూర్ అహ్మద్ చెప్పారు. ఈ ఏడాది తాము రెండు ప్రధాని పోటీల్లో పాల్గొన్నామని అందులో ఒకటి మిన్నెసోటాలో, రెండోది కొలరాడోలో అని తెలిపారు. భారత్‌లోని గుల్మార్గ్, సోనామార్గ్, పహల్గామ్లలో ఇలాంటి పోటీలు నిర్వహిస్తే బాగుంటుందని, స్థానికుల్లో ప్రతిభ బయటికి వస్తుందని అభిప్రాయపడ్డారు. పోటీల్లో మా టీమ్ కాంస్యం సాధించడం గర్వంగా ఉందని అన్నారు.
ఈ అంతర్జాతీయ స్నో స్కల్ప్చర్ ఛాంపియన్‌షిప్‌లో వివిధ దేశాల కళాకారులు రూపొందించిన అద్భుతమైన మంచు కళాఖండాలను కింది వీడియోలో చూడవచ్చు..
#WATCH | USA | Team India wins bronze medal at International Snow Sculpture Championship in Colorado pic.twitter.com/usLQraJlAH
— ANI (@ANI) January 27, 2025
Bandi Sanjay | పద్మ అవార్డులు స్థాయి ఉన్నవాళ్లకే ఇస్తాం.. గద్దర్‌కు ఎలా ఇస్తాం : బండి సంజయ్
Brain Stroke | మానసిక ఒత్తిడి, ఒంటరితనం.. విడిపోయిన దంపతుల పిల్లలకు స్ట్రోక్ ముప్పు!
Suryapeta | ఆర్నెళ్ల కింద కులాంతర వివాహం.. యువకుడి దారుణ హత్య
Tribal King | రిపబ్లిక్ డే వేడుకలకు తొలిసారి ఓ ట్రైబల్ కింగ్.. ఆ రాజు ఎవరో తెలుసా..?