Crime news : ఆమె ఏడాదిపాటు తన దగ్గరి బంధవుతో సహజీవనం (Live in Relationship) చేసింది. అనంతరం కుటుంబాన్ని వదిలేసి తనతోనే ఉండాలని అతడిపై ఒత్తిడి చేసింది. అందుకోసం తనను పెళ్లి చేసుకోవాలని కోరింది. అయితే ఆమెను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని అతను నిరాకరించాడు. అయినా ఆమె ఒత్తిడి చేయడంతో కొట్టి చంపాడు. మృతదేహాన్ని (Dead body) సూట్‌కేసులో పెట్టి, నిర్మానుష్య ప్రదేశంలో పడేసి, డీజిల్ పోసి నిప్పటించాడు. తూర్పు ఢిల్లీ (East Delhi) లోని ఘాజీపూర్ ఏరియా (Ghazipur area) లో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఘాజీపూర్ ఏరియాలో ఆదివారం ఉదయం కాలిన సూట్‌కేసులో మహిళ మృతదేహం కనిపించింది. దాంతో పోలీసులు ఘటనా ప్రాంతానికి వెళ్లి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనా ప్రాంతంలో ఉన్న సీసీ ఫుటేజ్‌ను పరిశీలించారు. మృతదేహం బయటపడటానికి కొన్ని గంటల ముందు హ్యుందాయ్ వెర్నా కారు అక్కడ అనుమానాస్పదంగా ఉన్నట్లు గుర్తించారు. వెంటనే కారు ఓనర్‌ను సంప్రదించగా దాన్ని అమిత్ తివారీ (22) అనే వ్యక్తికి విక్రయించినట్లు తెలిపాడు.
అమిత్ తివారీని పట్టుకుని తమదైన శైలిలో విచారించగా నేరం ఒప్పుకున్నాడు. మృతురాలు శిల్పా పాండే (22) తన దగ్గరి బంధువని, ఆమెతో ఏడాదిపాటు సహజీనం చేశానని చెప్పాడు. ఆమె కుటుంబాన్ని విడిచిపెట్టి వచ్చి పెళ్లి చేసుకోవాలని తనపై ఒత్తిడి తెచ్చిందని, అందుకే ఆమెను కొట్టి చంపానని తెలిపాడు. ఆ తర్వాత మృతదేహాన్ని పడేయడం కోసం స్నేహితుడు అనూజ్ సాయం తీసుకున్నాని చెప్పాడు. దాంతో పోలీసులు అనూజ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు.
శిల్పా పాండే మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. శిల్పా పాండే తల్లిదండ్రులు గుజరాత్‌లోని సూరత్ వాసులుగా పోలీసులు విచారణలో తేలింది. దాంతో పోలీసులు వారికి హత్య విషయం తెలియజేశారు.
Snow Sculpture | ఆ మంచు శిల్పాలు అదుర్స్.. పోటీలో భారత్‌కు కాంస్యం.. Video
Bandi Sanjay | పద్మ అవార్డులు స్థాయి ఉన్నవాళ్లకే ఇస్తాం.. గద్దర్‌కు ఎలా ఇస్తాం : బండి సంజయ్
Brain Stroke | మానసిక ఒత్తిడి, ఒంటరితనం.. విడిపోయిన దంపతుల పిల్లలకు స్ట్రోక్ ముప్పు!
Suryapeta | ఆర్నెళ్ల కింద కులాంతర వివాహం.. యువకుడి దారుణ హత్య
Tribal King | రిపబ్లిక్ డే వేడుకలకు తొలిసారి ఓ ట్రైబల్ కింగ్.. ఆ రాజు ఎవరో తెలుసా..?