KTR : రాష్ట్రంలో రైతుబంధు (Raithu Bandhu) పథకాన్ని కొనసాగిస్తే ఆయనను ఎవరూ దేకరని, ఆ పథకాన్ని తీసుకొచ్చిన కేసీఆర్ (KCR) పేరే నిలబడుతదనే భయం సీఎం (Chief Minister) రేవంత్ రెడ్డి (Revanth Reddy) లో ఉన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS working president) కేటీఆర్ (KTR) ఎద్దేవా చేశారు. అందుకే రైతుబంధు ఇవ్వడంలేదని ఆరోపించారు. ఇప్పుడు స్థానిక సంస్థలు, పంచాయతీ ఎన్నికల కోసం రేవంత్ మళ్లీ రైతుభరోసా నాటకం ఆడుతున్నాడని, ఎన్నికలు అయిపోంగనే రైతుబంధు మళ్లీ బందేనని ఆయన విమర్శించారు. ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నేతలను జనం నిలదీయాలని పిలుపునిచ్చారు.
‘ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి అన్ని పంటలకు క్వింటల్‌కు రూ.500 బోనస్ ఇస్తమన్నడు. మరె ఎవరికన్నా బోనస్ పైసలు పడ్డయా..? ఇప్పుడు మాట మార్చి సన్నవడ్లు పండిస్తెనే బోనస్ ఇస్తం అంటున్నరు. ఇగ వ్యవసాయ మంత్రి అయితే సన్నవడ్లకు బోనస్ ఇచ్చుడు బాగుంది, రైతు భరోసా అక్కెరే లేదని రైతులే చెప్తున్నరు అంటున్నడు. ఇప్పుడు ఎన్నికలు ఉన్నయ్ కాబట్టి రైతుభరోసా ఇస్తం అని నాటకమాడుతున్నరు. ఈ నాటకాలను మీరు గమనించాలె. ఎన్నికలు అయిపోంగనే రైతు భరోసా కూడా బందైతది’ అని కేటీఆర్ హెచ్చరించారు.
‘ఇప్పుడు ఆరోగ్య శ్రీ అంటే వైఎస్ఆర్ యాదికొస్తరు. రైతుబంధు అంటే కేసీఆర్ గుర్తుకొస్తరు. అందుకే రైతుబంధు ఇస్తే కేసీఆర్‌కే పేరు వస్తదని, ఆయనను ఎవరూ దేకరని రేవంత్‌రెడ్డి భయపడుతున్నడు. రాష్ట్రంలో కేసీఆర్ ఆనవాళ్లే లేకుండా చేస్తానని రేవంత్ రెడ్డి చెప్పిన విషయాన్ని మీరు ఇక్కడ గమనించాలె. కేసీఆర్ పేరు మోగొద్దంటే రైతుబంధు ఇయ్యొద్దు అన్నది రేవంత్ అభిప్రాయం. రైతుభరోసా పేరుతో రేవంత్ రెడ్డి ఇచ్చిన ఎన్నికల హామీ ప్రకారం.. ఇప్పుడు రైతులకు ఒక్కో ఎకరానికి రూ.17,500 బాకీ ఉన్నడు. కాంగ్రెసోళ్లు ఇప్పుడు మళ్లా ఓట్లు అడగడానికి వస్తరు. అప్పుడు ఈ బాకీ డబ్బులు అడుగుండ్రి. రుణమాఫీ ఏమైందని అడుగుండ్రి. ఏమైంది బోనస్ అని అడుగుండ్రి. ఆరుగ్యారంటీలు ఏమైనయని నిలదీయుండ్రి’ అని కేటీఆర్ నల్లగొండ రైతులను కోరారు.
KTR | రేవంత్‌రెడ్డి దృష్టిలో మోసం చేసుడు కూడా చారిత్రాత్మకమే : కేటీఆర్
KTR | నల్లగొండ బిడ్డల బొక్కల్లో మూలుగ చావడానికి కారణం కాంగ్రెస్ : కేటీఆర్
KTR | వరి పంటలో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ చేసిండ్రు కేసీఆర్ : కేటీఆర్
KTR | ప్రపంచంలో ప్రజాశక్తి కంటే గొప్పదేదీ లేదని రుజువు చేసిన గడ్డ నల్లగొండ : కేటీఆర్
KTR | రైతు ధర్నాకు వచ్చినట్లు లేదు.. విజయోత్సవ ఊరేగింపులా ఉంది : కేటీఆర్
HFEA | కృత్రిమ వీర్యం.. నచ్చిన రూపం.. ఆ అవసరం లేకుండానే సంతానం!