కాల్వ శ్రీరాంపూర్ ఫిబ్రవరి 26 : పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం కునారం గ్రామంలో నివాసముంటున్న పేద కుటుంబానికి చెందిన కోడూరి కొమురమ్మ – శంకర్ గౌడ్ కూతురు సమత వివాహానికి ఏగోలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ట్రస్టు అధ్యక్షుడు ఏగోలపు సదయ్య గౌడ్ గురువారం ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా బియ్యం, పెళ్లి కూతురు సమతకు చీర అందించారు.
ఈ సందర్భంగా సదయ్య గౌడ్ మాట్లాడుతూ గత 21 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు పెద్దపల్లి నియోజకవర్గంలోని నిరుపేద కుటుంబాలకు పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో చింతం అశోక్, కోడూరి ఆంజనేయులు, సిరిపురం రమేష్, కోడూరి శ్రీనివాస్, నారగొని శ్రీనివాస్, కోడూరి రాజీరు, జూపాక ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.