KTR : సీఎం (Chief Minister) రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఎన్నికలకు ముందు పెద్దపెద్ద మాటలు చెప్పిండని, అధికారంలోకి వచ్చినంక ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS working president) కేటీఆర్ (KTR) విమర్శించారు. నల్లగొండ రైతు ధర్నా (Raithu dharna) లో మాట్లాడిన కేటీఆర్.. రైతు రుణమాఫీ విషయంలో రేవంత్ సర్కారు అట్టర్‌ప్లాప్ అయ్యిందన్నారు. రాష్ట్రంలో ఏ ఊర్లో చూసుకున్నా పావులా వంతు కూడా రుణమాఫీ కాలేదని ఆరోపించారు. కాంగ్రెస్ హామీలపై ఇప్పుడు గ్రామ సభల్లో జనం నిలదీస్తుంటే పాలకుల దగ్గర సమాధానం లేదని చెప్పారు.
‘ఎన్నికల ముందు రేవంత్ పెద్దపెద్ద మాటలు చెప్పిండు. అధికారంలోకి రాంగనే ఒకటే సంతకంతో రుణమాఫీ చేస్త అన్నడు. మరె ఇప్పుడు రుణమాఫీ జరిగిందా..? ఏ ఊర్లె గూడా 25 శాతం మందికి గూడా రుణమాఫీ కాలేదు. అసెంబ్లీలో ఇదే విషయమై నిలదీస్తే రేవంత్ రెడ్డి నోరు మెదపలే. ఏ ఊళ్లె అందరికీ రుణమాఫీ అయ్యిందో చూద్దాం పా.. అంటే సప్పుడు చెయ్యలే. అధికారంలోకి రాంగనే రుణమాఫీపై బ్యాంకులోళ్లందరినీ పిలిచి మాట్లాడిండ్రు. రుణమాఫీ కోసం రూ.45,500 కోట్లు కావాలె అని బ్యాంకులోళ్లు చెప్పిండ్రు. వారం రోజులకు రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ రూ.40 వేల కోట్లు సరిపోతయి అన్నడు. తర్వాత నెలకు రూ.31 వేల కోట్లు సరిపోతయన్నడు. ఆఖరికి జూన్‌లో క్యాబినెట్ మీటింగ్ పెట్టి రూ.26 వేల కోట్లు సరిపోతయని, బడ్జెట్లో రూ.26 వేల కోట్లే కేటాయించిండ్రు. కానీ ఇప్పటికీ రుణమాఫీకి ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.12 వేల కోట్లు కూడా దాటలే. అందుకే అంటున్న 49 వేల కోట్లల్ల పావులా వంతు కూడా రుణమాఫీ కాలేదు’ అని కేటీఆర్ అన్నారు.
‘ఇప్పుడు గ్రామ సభల్లో అధికారులను రైతులు నిలదీస్తున్నరు. ఏమాయె రుణమాఫీ అంటే సమాధానం లేదు. ఏమాయె ఆరు గ్యారంటీలు అంటే సమాధానం లేదు. కేసీఆర్ బిచ్చమేసినట్టు రూ.10 వేలే ఇస్తున్నడూ.. నేను రూ.15 వేలు ఇస్తా అని రేవంత్ రెడ్డి చెప్పిండు. మరె ఇస్తున్నడా రూ.15 వేలు..? ఆఖరికి రూ.12 వేలు ఇయ్యాలని నిర్ణయం జేసిండ్రు. పైగా అది చారిత్రాత్మక నిర్ణయం అని అంటున్నడు. మోసం చేసుడు గూడా చారిత్రాత్మకమేనా. ఆఖరికి రేషన్ కార్డు ఇయ్యడం కూడా చారిత్రాత్మకమట. ఏడాది నుంచి రాష్ట్రంలో రైతులను, గరీబులను ఈ ప్రభుత్వం చావగొడుతున్నది. రేషన్ కార్డు కావాలంటే దరఖాస్తు.. రైతు భరోసా అంటే దరఖాస్తు.. కులగణన అంటే దరఖాస్తు. ఇప్పుడు రాష్ట్రంలో ఎవరన్నా సంతోషంగా ఉన్నరా అంటే జిరాక్స్ సెంటర్లోల్లే. పెట్టిన దరఖాస్తే మళ్లీమళ్లీ పెట్టి ప్రజలు విసిగిపోతున్నరు’ అని కేటీఆర్ చెప్పారు.
KTR | నల్లగొండ బిడ్డల బొక్కల్లో మూలుగ చావడానికి కారణం కాంగ్రెస్ : కేటీఆర్
KTR | వరి పంటలో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ చేసిండ్రు కేసీఆర్ : కేటీఆర్
KTR | ప్రపంచంలో ప్రజాశక్తి కంటే గొప్పదేదీ లేదని రుజువు చేసిన గడ్డ నల్లగొండ : కేటీఆర్
KTR | రైతు ధర్నాకు వచ్చినట్లు లేదు.. విజయోత్సవ ఊరేగింపులా ఉంది : కేటీఆర్
HFEA | కృత్రిమ వీర్యం.. నచ్చిన రూపం.. ఆ అవసరం లేకుండానే సంతానం!