KTR : బీఆర్ఎస్ అధినేత (BRS chief) కేసీఆర్ (KCR) గురించి కొందరు తెలిసీతెలియని మూర్ఖులు అజ్ఞానంతో మాట్లాడుతున్నరని, ఆయన నల్లగొండ జిల్లాకు ఏం చేసిండని జిల్లాకు చెందిన ఓ మంత్రి అడుగుతున్నడని, ఇంత అజ్ఞానమా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS working president) కేటీఆర్ (KTR) మండిపడ్డారు. నల్లగొండ రైతు ధర్నా (Raithu Dharna) లో మాట్లాడిన ఆయన.. వరి పండించే విషయంలో కేసీఆర్.. పంజాబ్, హర్యానాలను తలదన్నేలా తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ చేసిండని గుర్తుచేశారు. తెలంగాణలో చివరి మడి వరకు, చివరి తడి వరకు సాగునీరిచ్చిన రైతు నాయకుడు కేసీఆర్ అని ఆయన కొనియాడారు.
‘ఇవాళ కొందరు తెలిసితెలియని మూర్ఖులు అజ్ఞానంతో మాట్లాడుతున్నరు. కేసీఆర్ నల్లగొండకు ఏం చేసిండని ఓ మంత్రి అడుగుతున్నడు. మరీ ఇంత అజ్ఞానమా..? నేను ఆ మంత్రికి, నల్లగొండ జిల్లా రైతుబిడ్డలందరికీ గుర్తుచేస్తున్నా. వరి పండించే విషయంలో పంజాబ్, హర్యానాను తలదన్నేలా తెలంగాణను నెంబర్ వన్ చేసిండు కేసీఆర్. ఎస్సారెస్సీ స్టేజ్-2 కింద ఉన్న తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ ప్రాంతాలకు కేసీఆర్ కంటే ముందు ఎన్నడూ సరిగా సాగునీరు ఇయ్యలేదు. ఎన్ఎస్పీ కింద కూడా ఎన్నడూ టెయిల్ ఎండ్ గ్రామాలకు నీళ్లు అందలేదు. కానీ కృష్ణలో, గోదావరిలో ప్రతి నీటిబొట్టును ఒడిసిపట్టి అటు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంగట్టినా, ఇటు ప్రపంచమే ఆశ్యర్యపోయే స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టు గట్టినా ఒక్క కేసీఆర్‌కే సాధ్యమైంది. చివరి మడి వరకు, చివరి తడి వరకు రైతులకు నీళ్లిచ్చిన రైతు నాయకుడు కేసీఆర్ అని నేను గర్వంగా చెబుతున్నా’ అని కేటీఆర్ అన్నారు.
ఈ సందర్భంగా పెద కాపర్తి దగ్గర ఓ రైతు చెప్పిన మాటను కేటీఆర్ గుర్తుచేశారు. ‘నేను ఇక్కడికి (రైతు ధర్నా ప్రాంగణానికి) వస్తుంటే మా నాయకుడు చిరుమర్తి లింగయ్య పెదకాపర్తి దగ్గర ఆపిండు. అన్నా జెండా ఎగరేసి పోవే అన్నడు. అక్కడ ఆ గ్రామానికి చెందిన ఓ రైతన్న మాట్లాడుతూ.. ‘అన్నా మీరు నల్లగొండల ఓ మాట జెప్పాలె’ అన్నడు. ఏం జెప్పాలె అంటే.. ‘ఏం లేదన్నా మేం నల్లగొండల పాలిచ్చే ఆవును వద్దనుకుని, ఎగిరితన్నే దున్నపోతులను మీద బెట్టుకున్నం. అదే మాట చెప్పాలె’ అన్నడు. ఈ మాట పెదకాపర్తి రైతు చెప్పిండు. నేను చెప్తలేను’ అని కేటీఆర్ చెప్పారు.
KTR | ప్రపంచంలో ప్రజాశక్తి కంటే గొప్పదేదీ లేదని రుజువు చేసిన గడ్డ నల్లగొండ : కేటీఆర్
KTR | రైతు ధర్నాకు వచ్చినట్లు లేదు.. విజయోత్సవ ఊరేగింపులా ఉంది : కేటీఆర్
HFEA | కృత్రిమ వీర్యం.. నచ్చిన రూపం.. ఆ అవసరం లేకుండానే సంతానం!