KTR : ముఖ్యమంత్రి (Chief Minister) రేవంత్రెడ్డి (Revanth Reddy) చెప్పేవన్నీ మాయమాటలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS working president) కేటీఆర్ విమర్శించారు. జనవరి 26 రాత్రి నుంచే రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు పడుతాయని చెప్పాడని, కానీ ఇంతవరకు రైతు భరోసా డబ్బులు రాలేదని ఆయన ఆరోపించారు. నల్లగొండ రైతు ధర్నా (Raithu Dharna) లో మాట్లాడిన కేటీఆర్.. నల్లగొండ బిడ్డల బొక్కల్లో మూలుగ చావడానికి కారణమే కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు. జనాన్ని మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు.
‘జనవరి 26న రాత్రి 12 గంటలకే రైతుభరోసా డబ్బులు టకీటకీమని పడుతయ్ అని రేవంత్రెడ్డి అన్నడు. మరె పడ్డయా..? మరె కేసీఆర్ 12 సార్లు ఇచ్చిండు గదా..! 2017 నుంచి ఆరేండ్లు నిరాటకంగా రైతు బంధు ఇచ్చిండ్రు గదా..! ఒక్క రైతుబంధు పథకానికే 11 విడతల్లో కేసీఆర్ రైతుల ఖాతాల్లో వేసింది రూ.73 వేల కోట్లు. కానీ కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. మాటలే చెప్పింది. ఈ ముఖ్యమంత్రి, ఈ కాంగ్రెస్ పార్టీ మీకు కొత్త కాదు. 55 ఏళ్లుగా చూసిన పార్టే కాంగ్రెస్. నల్లగొండ జిల్లాలో తాగునీటికి ఇబ్బందై మన పిల్లల బొక్కల్లో మూలుగా చావడానికి కారణమే కాంగ్రెస్. నల్లగొండ బిడ్డలు జీవచ్ఛవాలుగా మారడానికి కారణమే కాంగ్రెస్. నల్లగొండ రైతుల అవస్థకు కారణమే కాంగ్రెస్. మిమ్మల్ని మోసం చేయడానికే కాంగ్రెస్ నేతలు కొత్త వేషాలు వేసుకుని ఎన్నికలకు వచ్చిండ్రు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు’ అని కేటీఆర్ మండిపడ్డారు.
‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు అన్నీ బందయితయని కేసీఆర్ ఆనాడే ప్రతి సభలో చెప్పిండ్రు. ఆయన చెప్పినట్టే ఇప్పుడు కాంగ్రెస్ పాలకులు రైతుబంధు ఇస్తలేరు. పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక్కసారి రైతుబంధుగా ఏసిండు. అది కూడా అంతకు ముందే మనం దాచిపెట్టిన పైసలే. కేసీఆర్ హయాంలో నాట్లప్పుడు రైతుబంధు పడేది. కానీ రేవంత్ పాలనలో ఓట్లప్పుడు మాత్రమే రైతుబంధు పడుతది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు వస్తున్నయ్. అందుకే మళ్లీ కొత్త డ్రామా ఆడుతున్నడు. జనవరి 26 నుంచి మార్చి 31 వరకు రైతుబంధు పైసలు పడుతయట. మరి ఏ సంవత్సరం మార్చి నెలనో చెప్పలేదు’ అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు.
KTR | వరి పంటలో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ చేసిండ్రు కేసీఆర్ : కేటీఆర్
KTR | ప్రపంచంలో ప్రజాశక్తి కంటే గొప్పదేదీ లేదని రుజువు చేసిన గడ్డ నల్లగొండ : కేటీఆర్
KTR | రైతు ధర్నాకు వచ్చినట్లు లేదు.. విజయోత్సవ ఊరేగింపులా ఉంది : కేటీఆర్
HFEA | కృత్రిమ వీర్యం.. నచ్చిన రూపం.. ఆ అవసరం లేకుండానే సంతానం!