భద్రాద్రి కొత్తగూడెం : రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల(Auto drivers) ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల ఎంతోమంది ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మరెందరో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. తాజాగా ఇల్లందు పట్టణంలోని సత్యనారాయణపురానికి చెందిన రెడ్డబోయిన సుమంత్(36) ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే 8 నెలల క్రితం కొత్త ఆటో కొనుగోలు చేయగా.. ఆటో కిరాయిలు లేకపోవడంతో నెలవారీ కిస్తీలు చెల్లించలేకపోయాడు. దీంతో సుమారు రూ.5 లక్షల వరకు అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పులు కట్టలేక మనస్తాపంతో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..