సూర్యాపేట : కాంగ్రెస్ పాలనలో రైతులకు కన్నీళ్లే మిగిలాయి. సాగు, తాగు నీరు(Irrigation water) కోసం ప్రజలు అల్లాడుతున్నారు. సాక్షాత్తు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత జిల్లా సూర్యాపేటలో9Suryapet)నే నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి. దీంతో రైతులు పంటలను కాల్చి, ఎండిన వరిని కోసి నిరసన తెలుపుతున్నారు. తాజాగా అర్వపల్లి మండలం కొమ్మాల గ్రామం, నాగారం మండలం లక్ష్మాపురం గ్రామాల్లో ఎస్సారెస్పీ కాల్వలకు మరమ్మతులు చేయించి నీళ్లు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. ఆయా మండలాల్లోని గ్రామాల్లో నీళ్లు అందకపోవడంతో పొలాలు ఎండిపోతున్నాయంటూ ఆవేదన చెందిన రైతులు కాలువలో పెరిగిన గడ్డిని కోసి తమ నిరసన తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి నీళ్లు అందించాలని డిమాండ్ చేస్తున్నారు.
నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత జిల్లాకు సాగు నీరు రాక రైతుల ఇబ్బందులు
సూర్యాపేట జిల్లాలో సాగు నీరు రాక పంటలు ఎండిపోతున్నాయని రైతుల ఆవేదన
అర్వపల్లి మండలం కొమ్మాల గ్రామం, నాగారం మండలం లక్ష్మాపురం గ్రామాల్లో ఎస్సారెస్పీ కాల్వలకు మరమ్మత్తులు చేయించి నీళ్లు ఇవ్వాలని… pic.twitter.com/0vBYIVPVs0
— Telugu Scribe (@TeluguScribe) January 19, 2025