వసంత పంచమి వేడుకలను బుధవారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. చదువుల తల్లి సరస్వతీదేవి పుట్టినరోజును పురస్కరించుకొని భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి.
జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతీ శిశుమందిర్ పాఠశాలలో బుధవారం వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు.
యాచారం మండలంలోని నందివనపర్తి గ్రామంలోని జ్ఞానసరస్వతి దేవాలయంలో బుధవారం వసంతపంచమిని పురస్కరించుకుని పెద్ద ఎత్తున అక్షరాభ్యాసం చేపట్టారు. ముందుగా సరస్వతి అమ్మవారికి అభిషేకం, అలంకరణ అనంతరం పూజలు చేశారు
జిల్లా వ్యాప్తంగా బుధవారం వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని పారమిత విద్యాసంస్థల్లో వేదపండితులతో సరస్వతీ పూజ, అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు.
రాష్ట్రంలో మరో బాసరగా విరాజిల్లుతున్న సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రాఘవపూర్లోని సిద్ధి సరస్వతీదేవి పంచవటీ క్షేత్రం వసంత పంచమి ఉత్సవాలకు ముస్తాబైంది. క్షేత్ర పీఠాధిపతి కాశీనాథ్బాబా ఆధ్వర్యం�