ఆసిఫాబాద్ అంబేదర్చౌక్, ఫిబ్రవరి 14 : జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతీ శిశుమందిర్ పాఠశాలలో బుధవారం వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. పం డితుడు జంబోజు తిరుపతి ఆధ్వర్యంలో సరస్వతీ హోమం, అష్టోత్తర శతనామావళి పూజలు నిర్వహించారు.అనంతరం బాసర ఆలయం నుంచి వచ్చిన 50 మంది చిన్నారులకు తిలకందిద్ది అక్షరాభ్యాసం చేశారు. కార్యక్రమంలో చిన్నారుల తల్లిదండ్రులు, పాఠశాల కమిటీ కార్యదర్శి కొడ్యపాక వేణుగోపాల్, సహ కార్యదర్శి బోగ మధూకర్, ప్రధానోపాధ్యాయుడు కోటేశ్వరరావు ఉన్నారు.
పెంచికల్పేట్, ఫిబ్రవరి 14 : అంగన్వాడీ కేంద్రాల్లోని ప్రీ ప్రైమరీ విద్యార్థులకు ఆటాపాటలతో కూడిన విద్యనందించాలని పోషణ అభియాన్ జిల్లా కో ఆర్డినేటర్ ప్రవీ ణ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఎలపల్లి అంగన్వాడీ కేంద్రంలో వసంత పంచమి సందర్భంగా విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించారు. ముందు గా సరస్వతీ దేవి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అధికారులు తల్లిదండ్రులతో కలిసి విద్యార్థులతో ఓంకారాన్ని దిద్దించారు. జిల్లా కో ఆర్డినేటర్ ప్రవీణ్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలను ఆకట్టుకునేలా దృశ్యాలను ఏర్పాటు చేయాలని, అప్పుడే విద్యార్థులు రావడానికి ఇష్టపడుతారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రమేశ్, అంగన్వాడీ సూపర్వైజర్ హసీనా, అంగన్వాడీ టీచర్ శ్రీలత, తల్లిదండ్రులు, పిల్లలు పాల్గొన్నారు.
రెబ్బెన, ఫిబ్రవరి 14 : మండలంలోని ఎస్వీ ఇంగ్లిష్ మీడియం హైసూల్లో బుధవారం సరస్వతీ దేవీ పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు. ఆయా గ్రామా ల్లో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. వేద పండితులు సిరుపురం గురువయ్య సరస్వతీ పూజ నిర్వహించారు..
కాగజ్‌నగర్ టౌన్, ఫిబ్రవరి 14: పట్టణంలోని శ్రీ సరస్వతీ శిశుమందిర్ ద్వారకా నగర్ పాఠశాలలో చిన్నారులకు అక్షరాభ్యా స కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్, డాక్టర్ అనిత పాల్గొని సరస్వతీ మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పాఠశాల పూ ర్వ విద్యార్థి కలర్ ప్రింటర్‌ను పాఠశాలకు బహూకరించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు కొండూరి రాజయ్య, భారతి, రంగ స్వామి, సమితి అధ్యక్షులు డాక్టర్ దామోదర్, మాతృ మండలి సభ్యులు, పూర్వ విద్యార్థులు, పోషకులు, సమాజ బంధువులు, తదితరులు పాల్గొన్నారు.