వసంత పంచమి వేడుకలను బుధవారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. చదువుల తల్లి సరస్వతీదేవి పుట్టినరోజును పురస్కరించుకొని భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి. అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, పిల్లలతో అక్షరాభ్యాసం చేయించారు.